యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద  పూర్తిగా డీలా పడిపోయాడు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘ఇద్దరి లోకం ఒకటే’ కూడా ఈ కుర్ర హీరోని  నిండా ముచ్చేసింది. ఎలాంటి సపోర్ట్ లేకుండా చాల స్పీడ్ గా ఎదిగిన రాజ్ తరుణ్.. చివరికీ అంతకన్నా స్పీడ్ గా పడిపోయాడు. అయితే ప్రసుతం  కె.కె. రాధామోహన్‌ నిర్మాణంలో  కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో  ‘ఒరేయ్ …బుజ్జిగా’ అనే  సినిమా  చేస్తున్నాడు. ఈ సినిమా పై రాజ్ తరుణ్  చాలా ఆశలే  పెట్టుకున్నా..  ఈ సినిమా అవుట్ ఫుట్ కూడా బాగా రాలేదని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.   ఈ సినిమా  కథ వెరీ రొటీన్ ప్లేతో సాగుతూ  మిస్ అండర్ స్టాడింగ్ కామెడీతో  రెగ్యులర్ గా ఉంటుందట.  ‘గుండె జారి గ‌ల్లంత‌య్యిందే’ సినిమాతో  హిట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొండా విజయ్ కుమార్ కెరీర్ కి కూడా ఈ సినిమా చాల కీలకం కానుంది.

అయితే స్టోరీ లైన్ మాత్రం కాస్త ఇంట్రస్టింగ్ గా ఉందట.  గాలికి తిరిగే ఓ కుర్రాడు  తన కన్నా వయసులో పెద్దదైన  ఓ అమ్మాయిని  లవ్ చేస్తాడట.  దాంతో ఆ తరువాత జరిగే నాటకీయ పరిణామాలు ఎలా ఉంటాయి ?   తనకన్నా పెద్దది అయిన ఆ అమ్మాయిని సొంతం చేసుకునే క్రమంలో ఈ కుర్రాడు  ఏమి చేశాడు ? ఇలా  ముదురు భామతో సాగే ప్రేమతో ఈ సినిమా సాగుతుందట.  మొత్తానికి  మొయిన్ పాయింట్ పరంగా బాగున్నా.. స్క్రీన్ ప్లే మాత్రం బాగా బోర్ సాగుంతుందని..  అందుకే కొన్ని సీన్స్ ను రీషూట్ చేశారని తెలుస్తోంది.  పాపం అసలుకే రాజ్ తరుణ్ కు  హిట్ వచ్చి చాలా కాలం అయిపోయింది.  గత ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. ఒక్క సినిమాతో కూడా ఏవరేజ్ హిట్ కొట్టలేకపోయాడు. ఇప్పుడు ముదురు భామతో  ప్రేమ సినిమా కూడా పోతే  మనోడు హీరోగా ఇక కష్టమే.  మరి ఈ సినిమాతోనైనా ఈ యంగ్ హీరో హిట్ అందుకోవాలని ఆశిద్దాం.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.