న్యూ ఇండియా..28 రాష్ట్రాలు..9 కేంద్ర పాలిత ప్రాంతాలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 3:45 PM GMT
న్యూ ఇండియా..28 రాష్ట్రాలు..9 కేంద్ర పాలిత ప్రాంతాలు..!

ఈ రోజు నుంచి ఇండియా మ్యాప్‌లో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు అదనంగా చేరాయి. జమ్ముకశ్యీర్‌ రాష్ట్రం నేటి నుంచి అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. లఢఖ్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది. దేశంలో ఇప్పుడు 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత రాష్ట్రాలు ఉన్నట్లు.

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్లు కేంద్రం ఆగస్ట్ న ప్రకటించింది. ఆగస్ట్ 9న రాష్ట్రపతి కోవింగ్ ఆమోద ముద్ర వేశారు. అక్టోబర్ 31 నుంచి జమ్ముకశ్మీర్‌ నుంచి లఢఖ్ విడిపోయి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడింది. ఇది లఢఖ్ వాసుల కల. ఈ రోజు నుంచి భారత రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి రానుంది. భారతీయులకు ఎటువంటి హక్కులు లభిస్తాయో..నేటి కశ్మీర్, లఢఖ్ వాసులకు అటువంటి హక్కులే లభిస్తాయి. అక్కడ మహిళలకు ఆస్తి హక్కు ఉంటుంది. వారు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఎక్కడైనా ఉద్యోగం చేయవచ్చు. భారతదేశంలో అమలయ్యే ప్రతి పథకం ఇక...జమ్ముకశ్మీర్‌లో కూడా అమలవుతుంది.

రెండ్రోజుల క్రితం ఈయూ బృందం కూడా జమ్ముకశ్మీర్‌లో పర్యటించింది. జమ్ముకశ్మీర్‌లోని పరిస్థితులపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీలకు మంచి జరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

జమ్ము కశ్మీర్‌ ఫస్ట్ లెఫ్ట్ నెంట్ గవర్నర్‌గా జీఎస్ ముర్మ ప్రమాణస్వీకారం చేశారు.

ఆర్టికల్ 370 రద్దుతరువాత గగ్గోలు పెట్టిన పాకిస్థాన్ అంతర్జాతీయ వేదికల మీద ఎటువంటి మద్దతు లభించలేదు. చివరకు అణు యుద్ధం గురించి పాక్‌ ప్రధాని ఇమ్రాన్ మాట్లాడారు. అవన్నీ కూడా భారతీయులు తాటాకు చప్పుళ్లగానే భావించారు. ఆర్టికల్ 370 రద్దు చేయడంలోనూ, అంతర్జాతీయ సమాజాన్ని ఒప్పించడంలోనూ భారత్ విజయం సాధించిందనే చెప్పాలి. ఏడు దశాబ్దాలుగా ఉన్న రాచపుండుకు మోదీ చరమగీతం పాడారనే చెప్పాలి.

NEW INDIA

New India

Next Story