త్వరలో కొత్త విద్యా విధానం

By సుభాష్  Published on  1 Feb 2020 7:49 AM GMT
త్వరలో కొత్త విద్యా విధానం

దేశంలో త్వరలో కొత్త విద్యా విధానాన్ని తీసుకురానున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. విద్యారంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామన్నారు. విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్‌ ఇండియా అనే కార్యక్రమం తీసుకురానున్నట్లు చెప్పారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా 2020-21సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌ సభలో ప్రసంగించారు. 2026 నాటికి 150 యూనివర్సిటీల్లో కొత్త కోర్సులను తీసుకురాబోతున్నట్లు పేర్కొన్నారు. విద్యారంగానికి రూ. 99,300 కోట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. నైపుణ్యాభివృద్ధికి రూ. 3వేల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా సరస్వతి, సింధు యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే స్టార్టప్‌లకు పెద్ద పీటవేస్తూ, ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నామన్నారు. ఇతరులకు ఉపాధి కల్పించేలా యువత ఎంతో ఎదగాలని సూచించారు.

డిజిటల్‌ ఇండియాకు పెద్ద పీట

డిజిటల్‌ ఇండియాకు పెద్ద పీట వేయనున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలో డిజిటల్‌ లావాదేవీలు పెరిగిన కారణంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద అందరికి ఆవాసం ఏర్పాటు చేయనున్నామని, ఇప్పటి వరకు 40 కోట్ల మందికి జీఎస్టీ రిటర్న్‌ దాఖలు చేశామని చెప్పారు. జీడీపీతో ప్రభుత్వ రుణభారం తగ్గుతుందని, గత ఏడాది 48.7 శాతం తగ్గిందన్నారు.

Next Story