లండన్ ఆసుపత్రి కి నవాజ్ షరీఫ్ ??
By సత్య ప్రియ Published on 2 Nov 2019 3:21 AM GMTపాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం కుదుటపడుతోంది. తీవ్ర అనారోగ్యంతో లాహోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి మెరుగుపడుతున్నట్టు వైద్యులు చెప్తున్నారు. గురువారం నాటికి, ప్లేట్ లెట్ల సంఖ్య 36 వేల నుంచి 51 వేల కు పెరిగింది. కానీ, బీపి, షుగర్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే, అయనని వైద్యం కోసం లండన్ కు తరలించే అంశంపైన పార్టీ నేతలు స్పందిస్తూ 'ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంటే, విదేశాలకు తీసుకువెళ్లాలో లేదో అనే విషయం పై నిర్ణయం తీసుకుంటామని‘ చెప్పారు. వైద్యం కొసం విదేశాలకు వెళ్లే విషయంపై కేవలం నవాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకోగలరని పాక్ విదేశాంగ శాఖ మంత్రి క్వాజా అసిఫ్ అన్నారు.
మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన షరీఫ్ కు గుండెపోతు వచ్చి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
Next Story