లైంగిక శక్తిని పెంచే తాటిబెల్లం

By రాణి  Published on  30 March 2020 12:35 PM IST
లైంగిక శక్తిని పెంచే తాటిబెల్లం

రోడ్డుపక్కన వెళ్తుంటే తాటిబెల్లం అమ్మవాళ్లను మీలో చాలామంది చూసే ఉంటారు. అసలు తాటి బెల్లం దేనికి ఉపయోగిస్తారు ? ఎలా తయారు చేస్తారు ? దీని వల్ల ఉపయోగాలేంటి ? ఇలాంటి విషయాలు మీకు తెలుసా ? తెలియక పోతే ఇప్పుడు తెలుసుకోండి.

ఎలా తయారు చేస్తారు ?

ఈ తాటి బెల్లం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయి. తాటి చెట్టునుండి వచ్చే తాజా నీరాతో తాటిబెల్లాన్ని తయారు చేస్తారు. ఒక చెట్టు నుంచి రోజుకు 6 లీటర్ల వరకూ నీరా వస్తుంది. 100 లీటర్ల నీరా నుంచి 10 కిలోల తాటిబెల్లాన్ని తయారు చేయొచ్చు. తాటిచెట్టునుంచి తీసిన నీరా ను ఒక బాండలిలో పోసి మరగపెడతారు. 2-3 గంటలు మరగబెట్టిన నీరాను చల్లార్చి వడకడతారు. అప్పటికే చిక్కగా మారిన నీరాను ఒక పాత్రలో పోసి ఉంచుతారు. అది గడ్డకట్టి బెల్లంలా మారుతుంది. సాధారణ బెల్లం కన్నా తాటిబెల్లం రేటే ఎక్కువ. మామూలు బెల్లం కిలో రూ.70 ఉంటే తాటిబెల్లం కిలో రూ.150 ఉంటుంది. ఇది అన్ని కాలాల్లోనూ దొరకదు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని తయారీ దారులు తాటిబెల్లాన్ని తమ బళ్లపై తీసుకొచ్చి అమ్ముతుంటారు.

తాటిబెల్లం వల్ల ప్రయోజనాలు

రోడ్డు పక్కనే అమ్ముతున్నారు కదా. ఇది ఆరోగ్యానికి చేటు చేస్తుందని మాత్రం అపోహ పడొద్దు. తాటి బెల్లంలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువ ఉంటాయి. తాటిబెల్లం తినడం వల్ల మలబద్ధకం పోతుంది. జీర్ణాశయ ఎంజైమ్ ల పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. తాటిబెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. శ్వాసకోశ నాళాలు, చిన్నపేగుల్లో పేరుకున్న విషపదార్థాలను ఇది తొలగిస్తుంది. అంతేకాదు దగ్గు, జలుబు వంటి రోగాలు దరిచేరకుండా చేస్తోంది. శరీర బరువును కూడా తగ్గిచడంలో తాటిబెల్లం తోడ్పడుతుంది. చిన్నపిల్లల్లో ఉండే రక్తహీనతను తాటిబెల్లం తగ్గిస్తుంది. తాటిబెల్లానికి వీర్యకణాలను పెంపొందించే శక్తి ఉంటుంది కాబట్టి..ఇది పురుషులు తినడం వల్ల లైంగిక శక్తి పెరుగుతుంది. అందుకే తాటిబెల్లాన్ని సహజమైన వయాగ్రా గా చెప్తుంటారు. భోజనం తర్వాత కొంచెం తాటిబెల్లం ముక్క తింటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

Next Story