మొదటిసారిగా తెలంగాణ యాసలో మాట్లాడనున్న నేచురల్‌ స్టార్‌ నాని

By సుభాష్  Published on  24 May 2020 10:29 AM IST
మొదటిసారిగా తెలంగాణ యాసలో మాట్లాడనున్న నేచురల్‌ స్టార్‌ నాని

నేచురల్‌ స్టార్‌ నాని.. ఎప్పటికప్పుడు కొత్త స్టోరీలతో కెరీర్‌లో ముందుకెళ్తున్నాడు. అలాగే కొత్త డైరెక్టర్లను కూడా ప్రోత్సహిస్తుంటాడు. అయితే తాజాగా నాని శివ నిర్మాణంతో చేస్తున్న 'టక్‌ జగదీష్‌' సినిమా తర్వాత చేయబోయే సినిమాలన్నీ కొత్త డైరెక్టర్లతో చేస్తున్నవే. వీటిలో రాహుల్‌ సంకృత్యాన్‌, వివేక్‌ ఆత్రరేయ సినిమాలతో పాటు సుకుమార్‌ శిష్యుడైన శ్రీకాంత్‌తో కూడా ఓ సినిమా చేయనన్నాడు. ఈ సినిమాను సుధాకర్‌ చెరకూరి నిర్మించనున్నాడు.

అయితే వచ్చే సంవత్సరం సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో నాని తొలిసారిగా తెలంగాణ యాసలో మాట్లాడనున్నాడట. అలాగే ఇందులో నాని స్టైల్‌ కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినది ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం 'టక్‌ జగదీష్‌' కోసం గోదావరి యాస మీద పట్టు సంపాదించాడు. గతంలో కృష్ణార్జున యుద్దంలోనూ చిత్తూరు యాసలో మాట్లాడి అందరిని కడుపుబ్బా నవ్వించాడు. ఇక రాబోయే కొత్త సినిమా కోసం తెలంగాణ యాసలో మాట్లాడనున్నాడు.

ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో లవ్‌స్టోరీ అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్టోరీ విని నాని ఆకర్షితుడయ్యాడట. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ మూవీలో నాని తప్పకుండా తెలంగాణ యాసలోనే మాట్లాడాల్సి ఉంటుంది.

Next Story