కదులుతున్న బస్సు నుంచి ఊడిన చక్రాలు.. ఆ తర్వాత

కదులుతున్న బస్సు నుంచి వెనకటైర్లు అకస్మాత్తుగా ఊడిపోయాయి. దాంతో.. ప్రయాణికులంతా ఒక్కసారిగా భయపడిపోయారు.

By Srikanth Gundamalla  Published on  17 Dec 2023 5:43 AM GMT
Wheels blown off, moving bus, tamil nadu,

కదులుతున్న బస్సు నుంచి ఊడిన చక్రాలు.. ఆ తర్వాత 

కదులుతున్న బస్సు నుంచి వెనకటైర్లు అకస్మాత్తుగా ఊడిపోయాయి. దాంతో.. ప్రయాణికులంతా ఒక్కసారిగా భయపడిపోయారు. ఈ అసాధారణ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. సేలం జిల్లా ఎడప్పాడి దగ్గర జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది.

ఓ ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు సేలం కొత్త బస్‌ స్టేషన్‌ నుంచి ఎడప్పాడికి ప్రయాణికులతో బయల్దేరింది. కొంచెం దూరం వెళ్లగాని బస్సు ముందు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. ప్రమాద సమయంలో బస్సుల్లో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ముందు టైర్లు పేలడంతో బస్సు అదుపుతప్పింది. ఆ వెంటనే బస్సు వెనక చక్రాలు కూడా ఉన్నట్లుండి ఊడిపోయాయి. ప్రమాద తీవ్రత దాంతో మరింత ఎక్కువైంది. ముందు టైరు పేలిందన్న ఆందోళన ఉండగా.. వెంటనే వెనకటైర్లు ఊడిపోవడంతో ప్రయాణికులు అరుపులు మొదలుపెట్టారు. పెద్ద శబ్దంతో బస్సు వెనకభాగం రోడ్డును తాకింది.

బస్సు వెనకాల రెండు టైర్లు లేకుండానే ముందుకు వెళ్లింది బస్సు. ఈ క్రమంలో బస్సు వెనక భాగం ధ్వంసం అయ్యింది. రోడ్డుపై టైర్లు లేకుండా బస్సు ముందుకు వెళ్లడంతో మిగతా వాహనాదారులు భయాందోళనకు గురయ్యారు. కాగా..క్షణాల్లోనే బస్సును కంట్రోల్‌లోకి తీసుకున్న డ్రైవర్.. నిలిపేశాడు. దాంతో.. వెంటనే ప్రయాణికులంతా బస్సు నుంచి బయటకు దిగారు. ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదస్థలిని పరిశీలించారు. అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవరికీ చిన్నపాటి గాయాలు కూడా కాలేదని పోలీసులు తెలిపారు. ఇక ప్రయాణికుల కోసం మరో బస్సును ఏర్పాటు చేసి వారివారి గమ్యస్థానాలకు పంపినట్లు వెల్లడించారు.


Next Story