సీఎం మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం, ఆస్పత్రికి తరలింపు

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలకు తీవ్ర గాయం అయ్యిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎక్స్‌ వేదికగా తెలిపింది.

By Srikanth Gundamalla
Published on : 14 March 2024 9:30 PM IST

west bengal, cm mamata banerjee, head injury,

 సీఎం మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం, ఆస్పత్రికి తరలింపు

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమాదానికి గురయ్యారు. దాంతో.. తలకు తీవ్ర గాయం అయ్యింది. వెంటనే స్పందించిన సిబ్బంది సీఎం మమతా బెనర్జీని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మమతా బెనర్జీ గాయపడినట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. ఫొటోలను షేర్ చేసింది.

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలకు తీవ్ర గాయం అయ్యిందని బెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎక్స్‌ వేదికగా తెలిపింది. ఆమె తలకు గాయమై రక్తం కారుతోన్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలిపింది. ఆమెను వెంటనే కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి తరలించినట్లు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మమతా బెనర్జీ త్వరగా కోలుకుకోవాలని అందరూ ప్రార్థించాలంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్‌ వేదికగా రాసుకొచ్చింది. కాగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎలాంటి ప్రమాదానికి గురయ్యారు. గాయం ఎలా అయ్యిందనే విషయాలను మాత్రం పార్టీ వెల్లడించలేదు.

మరోవైపు సీఎం మమతా బెనర్జీ తలకు గాయమైన ఫొటోలను చూసిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఎలా గాయపడ్డరనే విషయం తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మమతా బెనర్జీ ఆస్పత్రిపాలు కావడంతో పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మమతా బెనర్జీ త్వరగా కోలుకుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇక మమతకు గాయం ఎలా తగిలిందనే విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు ఇంట్లో జారి పడటంతోనే తలకు తీవ్ర గాయం అయ్యిందనే ప్రచారం జరుగుతోంది.


Next Story