టెలిగ్రామ్‌లో సినిమాలు చూసేవారికి అలర్ట్!
టెలిగ్రామ్‌లో సినిమాలు చూసేవారికి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సైబర్ దోస్త్ హెచ్చరికలు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 29 Dec 2023 8:25 AM GMTటెలిగ్రామ్‌లో సినిమాలు చూసేవారికి అలర్ట్!
కొత్తగా థియేటర్లలో విడుదలైన సినిమాల నుంచి ఓటీటీలో వచ్చే సినిమాలు..అలాగే స్పోర్ట్స్ లైవ్ లింక్‌లు ఇలా ఒక్కటేంటి అన్నింటిని టెలిగ్రామ్‌లో అందుబాటులోకి తెస్తున్నారు. దొంగచాటుగా ఇలాంటి చానెల్స్‌ను నిర్వహిస్తున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలనుకునే వారు ఓటీటీలకు డబ్బులు కట్టకుండా ఇందులో సెర్చ్ చేసి లింక్‌ల ద్వారా ఫ్రీగా చూసేస్తుంటారు. అలాంటి వారికి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సైబర్ దోస్త్ హెచ్చరికలు జారీ చేసింది.
టెలిగ్రామ్‌లో చాలా మంది విడుదలైన సినిమాలను ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఓటీటీలో ఉండే సినిమాలు, సిరీస్‌లను కూడా ఖర్చు లేకుండా ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. గ్రూపులు క్రియేట్ చేసి అందులో లింక్‌లు పెడుతుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఫ్రాడ్ పనులు కూడా చేస్తున్నారు. కొత్త సినిమాల మోజులో పడి టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరొద్దనీ.. మోసపోవద్దని సైబర్ దోస్త్ సూచిస్తోంది.
ఐబొమ్మ, టెలిగ్రామ్ వంటి వాటిల్లో కొత్త సినిమాల థంబ్‌నైల్స్ పెట్టి.. సైబర్ లింక్‌లు అటాచ్ చేస్తున్నారు. ఆ లింక్స్‌పై క్లిక్ చేశామా అంతే సంగతులు. ఒక్కసారి లింక్ ప్రెస్ చేయగానే సైబర్ నేరగాళ్లకు మన సమాచారం వెళ్లిపోతుంది. దాంతో.. వారు సులువుగా ట్రాప్ చేసి.. డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని సైబర్ దోస్త్ గుర్తించింది. ఈ తరహా మోసాలు టెలిగ్రామ్ యాప్‌లో భారీగా జరుగుతున్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సినిమాల మోజులో పడి తెలియని లింక్స్ ఓపెన్ చేయొద్దని.. డబ్బులు పోగొట్టుకోవద్దని వారు సూచిస్తున్నారు. టెలిగ్రామ్ ద్వారా వచ్చే లింక్‌ల నుంచి ఎలాంటి యాప్స్ డౌన్‌లోడ్ కూడా చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.