ప్రయాణికులు.. ప్లీజ్ ఇలాంటి అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడకండి

ఢిల్లీ మెట్రో రైలులో ఓ జంట ముద్దుల్లో మునిగితేలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఢిల్లీ మెట్రో కోచ్ లో నేలపై కూర్చున్న

By M.S.R  Published on  11 May 2023 7:45 PM IST
Kissing, metro Coach, Delhi Metro, Commuters

ప్రయాణికులు.. ప్లీజ్ ఇలాంటి అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడకండి

ఢిల్లీ మెట్రో రైలులో ఓ జంట ముద్దుల్లో మునిగితేలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఢిల్లీ మెట్రో కోచ్ లో నేలపై కూర్చున్న ఓ యువకుడి ఒడిలో అమ్మాయి పడుకోగా, ఆమెకు అతడు ముద్దులు పెడుతూ కనిపించాడు. ఢిల్లీ మెట్రోలో ఈ మధ్య కాలంలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్ సీ) స్పందించింది. ప్రయాణికులు ఇలాంటి అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ మెట్రోలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరింది.

‘‘ఇలాంటి సంఘటనలు జరిగినపుడు సమీపంలో అందుబాటులో ఉన్న మెట్రో సిబ్బంది/సీఐఎస్‌ఎఫ్‌కు వెంటనే తెలియజేయండి. దీంతో తగిన చర్యలు తీసుకోవచ్చు’’ అని ప్రయాణికులను మెట్రో అధికారులు కోరారు. ‘‘సమాజంలో ఆమోదయోగ్యమైన సామాజిక మర్యాదని పాటించాలని కోరుతున్నాం. ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించే విధంగా లేదా తోటి ప్రయాణికుల మనోభావాలను కించపరిచే ఎలాంటి అసభ్యకరమైన/అశ్లీల కార్యకలాపాల్లో పాల్గొనొద్దు. డీఎంఆర్‌సీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చట్టం సెక్షన్ 59 ప్రకారం అసభ్యత అనేది శిక్షార్హమైన నేరం’’ అని డీఎంఆర్ సీ ఓ ప్రకటనలో హెచ్చరించింది. ఇకనైనా ఇలాంటి ఘటనలు ఢిల్లీ మెట్రోలో తగ్గుతాయేమో చూడాలి.

Next Story