రన్నింగ్‌లో ఉన్న బైక్‌పై రొమాన్స్‌.. వీడియో వైరల్

రన్నింగ్‌లో ఉన్న బైక్‌పై యువతీ యువకులు రొమాన్స్‌ చేశారు. యువతి పెట్రోల్‌ ట్యాంక్‌పై కూర్చుని..

By Srikanth Gundamalla  Published on  23 Jun 2023 4:26 PM IST
UP, Bike Romance, Video Viral, Police Challan

రన్నింగ్‌లో ఉన్న బైక్‌పై రొమాన్స్‌.. వీడియో వైరల్  

రోజు రోజుకు కొంతమంది యువత రెచ్చిపోతున్నారు. ప్రేమ పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. రోడ్డు.. బహిరంగ ప్రదేశాలు అని కూడా చూడకుండా రొమాన్స్‌ చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ మెట్రోలో ఓ ప్రేమ జంట చుట్టుపక్కల ఎంత మంది ఉన్నా పట్టించుకోకుండా ముద్దుల్లో మునిగిపోయింది. తాజాగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మరోటి చోటుచేసుకుంది. రన్నింగ్‌ బైక్‌పై రెచ్చిపోయి రొమాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. చివరకు పోలీసులు కూడా స్పందించారు. వారిపై చర్యలు తీసుకున్నారు.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో రహదారిపై ఈ ఘటన జరిగింది. కారులో వెళ్తున్న కొందరు ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించారు. రోడ్డుపై రన్నింగ్‌లో ఉన్న బైక్‌పై యువతీ యువకులు రొమాన్స్‌ చేశారు. యువతి పెట్రోల్‌ ట్యాంక్‌పై కూర్చుని.. యువకుడిని హగ్‌ చేసుకుని కూర్చుంది. ఇద్దరూ కనీసం హెల్మెట్స్‌ కూడా పెట్టుకోలేదు. డేంజర్‌గా బైక్‌ డ్రైవ్‌ చేస్తూ ఇతర వాహనదారులను భయాందోళనకు గురి చేశారు. పైగా మెళ్లిగా వెళ్తున్నారా అంటే అదీ లేదు.. హైస్పీడ్‌ వేగంతో మిగతా వెహికల్స్‌ను ఓవర్‌ టేక్ చేస్తున్నారు. ఇది గమమనించిన కొందరు కారులో వెళ్తూ వీడియో రికార్డు చేశారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. చివరకు ఉత్తర్‌ ప్రదేశ్‌ పోలీసుల వరకు చేరింది. ట్విట్టర్‌ నుంచి అందిన ఫిర్యాదు మేరకు పరిగణనలోకి తీసుకున్నారు. బైక్‌ నెంబర్ ఆధారంగా వాహనదారుడికి చలానా విధించారు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించనందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేసినందుకు ఏకంగా రూ.21,000 ఫైన్‌ విధించినట్లు తెలిపారు.

Next Story