జమ్మూ కశ్మీర్‌లో కుప్పకూలిన వంతెన
Under Construction Bridge Collapses in Samba 27 Injured.జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెనపై ఐరన్
By M.S.R Published on 3 Jan 2022 6:32 AM GMTజమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెనపై ఐరన్ షట్టరింగ్ కూలిపోవడంతో 27 మంది కూలీలు గాయపడ్డారు. రామ్‌ఘర్-కోల్‌పూర్ వద్ద దేవిక నదిపై బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రధాన వంతెనను నిర్మిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నదిపై నిర్మిస్తున్న వంతెన కోసం రెండు స్తంభాలను కలుపుతూ వేసిన ఇనుప షట్టరు ఆకస్మాత్తుగా కూలిపోయింది. గాయపడిన కూలీలను ఆసుపత్రులకు తరలించారు.
గాయపడిన కూలీల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ప్రత్యేక చికిత్స కోసం జమ్మూలోని ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించారు. నదిపై వంతెనకు కంక్రీట్ స్లాబ్ వేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని.. దీనిపై సహాయ చర్యలు చేపట్టామని సాంబ డిప్యూటీ కమిషనర్ అనురాధ గుప్తా చెప్పారు. రామ్ ఘడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటరు, విజయ్ పూర్ ట్రామాసెంటర్లలో చికిత్స పొందుతున్న కూలీలను అనురాధ పరామర్శించారు.
వంతెనపై ఐరన్ షట్టరింగ్ కూలిపోవడంతో కనీసం 27మంది గాయపడ్డారు. గాయపడిన వారిని J&K పోలీసులు రక్షించారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. రామ్‌ఘర్-కోల్‌పూర్ వద్ద దేవిక నదిపై బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రధాన వంతెనను నిర్మిస్తోందని అధికారులు తెలిపారు. సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో రెండు స్తంభాలను కలిపే ఇనుప షట్టరింగ్ కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదని అధికారులు తెలిపారు.
ఇక జమ్మూ కాశ్మీర్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో శనివారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, కనీసం 16 మంది గాయపడ్డారు, కొత్త సంవత్సరం రద్దీ సమయంలో రెండు సమూహాల యాత్రికుల మధ్య గొడవ జరగడంతో తొక్కిసలాట మొదలైంది.