బాలుడ్ని బూటు కాలుతో తన్ని లేపిన రైల్వే పోలీసు, నెటిజన్ల ఆగ్రహం

రైల్వే స్టేషన్‌లో నిద్రపోతున్న చిన్నారిని బూటు కాలు మెడపై పెట్టి నిద్ర లేపాడు ఒక పోలీసు.

By Srikanth Gundamalla  Published on  17 July 2023 7:09 AM GMT
Uattar Pradesh, Railway Police, Thrashing Child,

బాలుడ్ని బూటు కాలుతో తన్ని లేపిన రైల్వే పోలీసు, నెటిజన్ల ఆగ్రహం

పోలీసులు అంటే ఇప్పటికీ చాలా మంది భయపడతారు. ఫ్రెండ్లీ పోలిసింగ్‌ అంటూ అధికారులు చెబుతున్నా.. కొన్ని ఘటనలు మాత్రం అందుకు భిన్నంగానే కనిపిస్తున్నాయి. పేదలు, ఎదురుతిరగని పరిస్థితుల్లో ఉన్నవారిని చూస్తే చాలు కొందరు పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తిస్తారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో నిద్రపోతున్న చిన్నారిపై రైల్వే పోలీసులు దారుణంగా ప్రవర్తించాడు. బాలుడి దగ్గరకు వెళ్లి బూటు కాలు మెడపై పెట్టి నిద్ర లేపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉతర్‌ప్రదేవ్‌లోని బల్లియాలో జరిగింది ఈ ఘటన. రైల్వే స్టేషన్‌లో ఆదమరిచి నిద్రపోతున్న పిల్లాడిని చూశాడు ఒక రైల్వే పోలీసు అధికారి. వెంటనే అతని దగ్గరకు వెళ్లి దారుణంగా ప్రవర్తించాడు. బూటు కాలు బాలుడి మెడపై పెట్టి అటూఇటూ కదిలించాడు. దాంతో ఆ పిల్లాడు భయపడిపోయి ఒక్కసారిగా నిద్రలో నుంచి తేరుకున్నాడు. పోలీసుని చూసి హడలిపోయాడు. అంతేకాక ఇక్కడెందుకు పడుకున్నావు అన్నట్లుగా రైల్వే పోలీసు బాలుడి మెడపైనే బూటు కాలు ఉంచి బెదిరించాడు. తర్వాత కొద్ది క్షణాలకే బాలుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ తతంగాన్ని అంతా ఒకరు వీడియో తీశారు. తర్వాత వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. అది కాస్త వైరల్‌గా మారింది. నెటిజన్లు సదురు రైల్వే పోలీసు అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం తప్పు చేశాడని అంత చిన్నపిల్లాడి పట్ల దురుసుగా ప్రవర్తిస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు? ఇంకొందరైతే అభివృద్ధి చెందిన దేశాలు, మన దేశంలో ఉన్న తేడా ఇదే అంటూ కామెంట్స్ చేశారు.

వైరల్‌ అయిన ఈ వీడియో చిరవకు రైల్వే పోలీసు ఉన్నతాధికారుల వరకు చేరింది. వీడియోలో ఉన్న రైల్వే పోలీసుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశించారు. విచారణ చేసి వదిలేయకుండా బాలుడిని బూటు కాలుతో తన్నిన వ్యక్తిని చట్టపరంగా శిక్షించాలంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. వీడియో చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story