మటన్ ముసుగులో కుక్క మాంసం రవాణా!
మటన్ ముసుగులో ఓ వ్యక్తి కుక్క మాంసాన్ని రవాణా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 28 July 2024 8:00 AM ISTమటన్ ముసుగులో కుక్క మాంసం రవాణా!
కొందరు మాంసం విక్రయదారులు ప్రజల ఆరోగ్యాలను పట్టించకోకుండా ఒక రోజు క్రితం మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఇంకొందరైతే కోళ్లు.. మటన్.. అంటూ ఇతర మాంసాలు విక్రయించారు. తాజాగా బెంగళూరులో ఇలాంటి ఘటనే ఒకటి కలకలం రేగింది. మటన్ ముసుగులో ఓ వ్యక్తి కుక్క మాంసాన్ని రవాణా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. శుక్రవారం సాయంత్రం బెంగళూరులోని కేఎస్‌ఆర్ రైల్వే స్టేషన్ దగ్గర వాగ్వాదం చెలరేగింది. ఒక వ్యాపారి మటన్ అమ్ముతున్నానంటూ.. కుక్క మాంసాన్ని సరఫరా చేస్తున్నాడని కొన్ని హిందూత్వ సంఘాలు విమర్శలు చేశాయి. ఆ మాంసం బెంగళూరుకి రాజస్థాన్ నుంచి రైలులో వచ్చింది.
అయితే రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి జైపూర్- మైసూర్ ఎక్స్‌ప్రెస్‌లో కుక్క మాంసం డబ్బాలు రవాణా అవుతున్నాయని పలువురు ఆరోపణలు చేశారు. ఏకంగా 90 మాంసం పార్సిల్స్‌ను వాహనంలోకి లోడ్ చేయకుండా అడ్డుకున్నాయి హిందూత్వ సంఘాలు. రైలులో పార్సిల్ ద్వారా వచ్చిన మాంసం.. మేక మాంసమే అంటూ వ్యాపారి చెబుతున్నాడు. తాను గత 12 ఏళ్లు ఈ వ్యాపారం చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. చివరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ విషయంలో కలుగ చేసుకున్నారు. ఫిర్యాదుల మేరకు మాంసం శాంపిళ్లను సేకరించారు. ఆ నమూనాలను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపించారు. మటన్ కాకుండా మరే జంతువుల మాంసమని తేలితే సదురు వ్యాపారితో పాటు.. రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ఫుడ్ సేఫ్టీ అధికారుల హామీతో హిందూత్వ సంఘాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ సంఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.