షాకింగ్‌ ఘటన.. డ్రైవర్‌ లేకుండా 70 ప్రయాణించిన రైలు

ఇండియన్ రైల్వేలో ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. డ్రైవర్‌ లేకుండా ట్రైన్‌ దాదాపు 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.

By Srikanth Gundamalla  Published on  25 Feb 2024 1:48 PM IST
train ,70 km journey, without driver, indian railways,

 షాకింగ్‌ ఘటన.. డ్రైవర్‌ లేకుండా 70 ప్రయాణించిన రైలు 

దేశంలో కొంతకాలంలో పలుచోట్ల రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దాంతో.. రైళ్లలో ప్రయాణించాలంటే కొంత మేర ప్రయాణికులు భయపడే పరిస్థితులు వచ్చాయి. సిబ్బంది చిన్నిచిన్న పొరపాట్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే.. తాజాగా ఇండియన్ రైల్వేలో ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. డ్రైవర్‌ లేకుండా ట్రైన్‌ దాదాపు 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్‌ లేకుండా ట్రైన్‌ అంత దూరం వెళ్లడంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. చివరకు రైల్వే అధికారులు తీవ్రంగా శ్రమించి రైలును ఆపడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు.

ఈ సంఘటన పంజాబ్‌ రాష్ట్రంలోని పఠాన్‌కోట్‌లో జరిగింది. ఓ గూడ్స్‌ రైలు డ్రైవర్‌ లేకుండానే 70 కిలోమీటర్ల వరకు వెళ్లిపోయింది. ఆ గూడ్సు రైలులో రాళ్ల లోడు ఉన్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఈ గూడ్సు రైలు డ్రైవర్ లేకుండా 5 స్టేషన్లను దాటేసిందట. దాదాపు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. డ్రైవర్ లేకుండా రైలు వెళ్లడం చూసిన స్థానికులు భయాందోళన చెందారు. అయితే.. గూడ్స్‌ రైలు వెళ్తున్న మార్గంలో ఇతర ఏ రైలు గాని.. క్రాసింగ్‌లు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇక గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పకపోవడం మంచిదైందని అధికారులు అంటున్నారు.

పఠాన్‌కోట్‌ రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలును డ్రైవర్ నిలిపాడు. అయితే.. దిగుతూ హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయి ఉంటాడని రైల్వే ఉన్నతాధికారులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇంజిన్‌ డ్రైవర్ దిగిపోయిన తర్వాత పట్టాలు జాలువారినట్లుగా ఉండటంతో రాళ్ల లోడుతో ఉన్న రైలు ఉందుకు కదిలిందనీ చెబుతున్నారు. అలా వెళ్తూనే వేగాన్ని అందుకుని చెప్పారు. అయితే.. ఆ తర్వాత వెంటనే ఆ ట్రైన్‌ ఆపే ప్రయత్నాలు చేసిన కుదరలేదని వెల్లడించారు. ఎవరికీ ఉచి బస్సీ రైల్వే స్టేషన్లో రైల్వే అధికారులు శ్రమించి గూడ్స్‌ రైలును నిలిపినట్లు చెప్పారు. రైలు పట్టాలపై చెక్కలు, ఇతర వస్తువులను అడ్డుపెట్టి ఎట్టకేలకు ఆపినట్లు చెప్పారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదుని రైల్వే అధికారులు చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.


Next Story