బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇంట్లో విషాదం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 13 Nov 2023 11:46 AM ISTబీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇంట్లో విషాదం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. జేపీ నడ్డా అత్తయ్య గంగాదేవి శర్మ (106) కన్నుమూశారు. హిమాచల్ ప్రదేశ్‌లో నివాసం ఉంటున్న ఆమె తన ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం 7 గంటలకు గంగాదేవి కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఇక ఇవాళ మధ్యాహ్నమే వ్యాస నది ఒడ్డున గంగాదేవి శర్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు వెల్లడించారు.
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అత్తయ్య వృద్ధాప్యంతో కన్నుమూశారు. ఆమె మరణంతో కులులోని శాస్త్రి నగర్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. అయితే.. గంగాదేవి శర్మ హిమాచల్ ప్రదేశ్‌లోని ఇంట్లో ఆమె ఒక్కరే ఉంటున్నారు. గంగాదేవిని సంరక్షణ కోసం బంధువులు ఇద్దరు కేర్‌టేకర్లను నియమించారు. జేపీ నడ్డా బాల్యం అంతా అత్త గంగాదేవి ఇంట్లోనే గడిచిపోయింది. అందుకే జేపీ నడ్డా.. కులుని తన రెండో స్వస్థలం అని చెబుతుంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన ప్రతీసారి తన అత్తయ్య ఇంటికి వెళ్తారు. కాగా ఇటీవల జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత వయోవృద్ధ ఓటరుగా గంగాదేవి శర్మ గుర్తింపు పొందారు. నాటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో నడ్డా తన అత్తను కలుసుకున్నారు. కాగా.. జేపీ నడ్డా ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా వాసి.