క్రిష్‌లా స్టంట్ చేయాలని స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకిన చిన్నారి
సినిమాల ప్రభావం పిల్లలపై చాలా ఉంటుంది. సినిమాలో కనిపించే హీరోలా చేయాలని పిల్లలు ప్రయత్నాలు చేస్తుంటారు.
By - Srikanth Gundamalla |
క్రిష్‌లా స్టంట్ చేయాలని స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకిన చిన్నారి
సినిమాల ప్రభావం పిల్లలపై చాలా ఉంటుంది. సినిమాలో కనిపించే హీరోలా చేయాలని పిల్లలు ప్రయత్నాలు చేస్తుంటారు. వారిని ఇమిటేట్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. డైలాగ్స్ చెప్పడం, డ్యాన్స్ చేయడం, యాక్టింగ్ చేయడం వరకు బాగానే ఉంటుంది.. కానీ ప్రమాదకర ఫీట్స్ చేస్తేనే ఇబ్బందులు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్.. ఇలా సూపర్ హీరోలను ఎంతో మంది చిన్నారులు ఇమిటేట్ చేస్తుంటారు. మన ఇండియాలో వచ్చిన బాలీవుడ్ మూవీ క్రిష్ సినిమా అందరికీ తెలిసే ఉంటుంది. హృతిక్ రోషన్ ఈ సినిమాలో చాలా స్టంట్స్ చేస్తారు. భవనం పైనుంచి కిందకు దూకడం.. ఒక బిల్డింగ్ పై నుంచి మరో భవనంపైకి దూకడం ఇలాంటివి. అయితే.. ఓ మూడో తరగతి విద్యార్థికి ఇవన్నీ బాగా నచ్చాయి. తాను కూడా అలానే చేయాలని భావించాడు. స్కూల్ భవనంలోని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకాడు. గాయాలపాలు అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్కూల్ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం कानपुर
कक्षा 3 के छात्र ने स्कूल बिल्डिंग से लगाई छलांग
स्कूल की पहली मंजिल से लगाई छलांग, गंभीर घायल
सुपर हीरो पर बनी फिल्म कृष से प्रेरित होकर लगाई छलांग
छात्र के मुंह, पैर में आई गंभीर चोट, अस्पताल में भर्ती
सीसीटीवी में कैद हुई पूरी घटना@kanpurnagarpol pic.twitter.com/I1MIvdXR3N
ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక విద్యార్థి క్రిష్ సినిమాలో హీరోలా స్టంట్ చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. డాక్టర్ వీరేంద్ర స్వరూప్ ఎడ్యుకేషనల్ స్కూల్‌లో చోటుచేసుకుంది ఈ ఘటన. బుధవారం ఈ సంఘటన జరగ్గా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక ఎనిమిదేళ్ల విద్యార్థి ఇదే స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు. స్కూల్‌లో క్లాస్ జరుగుతున్న సమయంలో నీళ్లు తాగుతానని చెప్పి బయటకు వచ్చాడు. ఆ తర్వాత క్రిష్ సినిమాలో మాదిరి కింద ల్యాండ్ అవ్వాలనే ఆలోచనతో విద్యార్థి కిందకు దూకేశాడు. దాదాపు 15 అడుగుల ఎత్తులో ఉన్న భవనం మొదటి అంతస్తు రెయిలింగ్ ఎక్కి.. కిందకూ జంప్ చేశాడు. అంతే.. ఒక్కసారిగా కిందపడిపోయాడు.
ఈ ఘటనలో బాలుడి కాలుకి, ముక్కుకి, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన స్కూల్ యాజమాన్యం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తోంది. ఇదంతా స్కూల్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. బాలుడు అలా స్టంట్ చేయడం వెనుక ఎవరి ప్రమేయం లేదని.. సహ విద్యార్థులు అక్కడ ఉన్నా ఎవరూ బలవంతం చేయలేదని స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు. అయితే.. విద్యార్థి తల్లి చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. బాబు ఎప్పుడూ క్రిష్ సినిమా చూసేవాడని..తాను కూడా సూపర్ హీరో భావించాడని చెప్పింది. తనకు స్టంట్ చేయాలనే కోరిక ఉండేదని బాబు చెప్పాడని స్వయంగా తల్లే వెల్లడించింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నపిల్లలకు ఇలాంటి వాటిపట్ల అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని.. లేదంటే ఇలాంటి పర్యావసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.