తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు దారుణ హత్య

తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు దారుణ హత్యకు గురయ్యాడు.

By Srikanth Gundamalla
Published on : 6 July 2024 8:09 AM IST

tamilnadu, BSP,  murder, crime,

తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు దారుణ హత్య 

బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలోని ఆయన నివాసం సమీపంలో శుక్రవారం ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపినట్లు అధికారులు తెలిపారు. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు.. తమిళనాడు బీఎస్పీ చీఫ్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌పై కత్తులతో దాడి చేశారు. దాంతో.. తీవ్రగాయాలపాలైన ఆర్మ్‌స్ట్రాంగ్‌ తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి. అయితే.. ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ఎవరు చంపారు..? ఎందుకు చంపారనే విషయాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

శుక్రవారం సాయంత్రం పెరంబూర్ ప్రాంతంలో నిర్మాణ స్థలాన్ని పరిశీలించేందుకు ఆర్మ్‌స్ట్రాంగ్‌ వెళ్లారు. అప్పుడే బైక్‌లపై వచ్చిన ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు. దాడి చేసిన వారిలో నలుగురు ఫుడ్‌ డెలివరీ ఏంజెట్లు దుస్తులు ధరించినట్లు తెలిసింది. పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్‌ను సేకరించి నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే.. దాడి తర్వాత ఆర్మ్‌స్ట్రాంగ్ తీవ్ర గాయాలపాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత పోస్టుమార్టం కోసం అతని మృతదేహాన్ని రాజీవ్గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆర్మ్‌స్ట్రాంగ్ గతంలో చెన్నై కార్పొరేషన్ కౌన్సిలర్‌గా పనిచేశాడు.

గత ఏడాది జరిగిన గ్యాంగ్‌స్టర్‌ ఆర్కట్‌ సురేష్‌ హత్యకు ప్రతీకారంగానే ఇది జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్యను బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా ఖండించారు.

ఈ హత్యపై బిజెపి తమిళనాడు చీఫ్ అన్నామలై స్పందిస్తూ... రాష్ట్రంలో పెరుగుతున్న హింసపై MK స్టాలిన్ నేతృత్వంలోని DMK ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఈరోజు చెన్నైలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తిరు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యారనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తమ ప్రార్థనలు అతని కుటుంబ సభ్యులకు, బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలకు ఉన్నాయి" అని బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై అన్నారు.

Next Story