ఇంట్లో దోమల మందు బాటిల్ పేలి నలుగురు మృతి?
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. మనలీలో ఓ ఇంట్లో నుంచి పొగలు రావడం మొదలు అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 8:24 AM GMTఇంట్లో దోమల మందు బాటిల్ పేలి నలుగురు మృతి?
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. మనలీలో ఓ ఇంట్లో నుంచి పొగలు రావడం మొదలు అయ్యాయి. అది గమనించిన స్థానికులు వెంటనే తలుపులను బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూశారు. ఇంట్లో నలుగురు చనిపోయి ఉండటాన్ని గమనించారు. అప్పటికే రూమ్ అంతా పొగతో నిండిపోయి ఉంది. దాంతో.. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులు ప్రమాదం సంభవించిన ఇంటిని పరిశీలించారు.
చెన్నైలోని మనలీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అయితే.. కరెంట్ ప్లగ్‌లో పెట్టిన దోమల నివారణ లిక్విడ్ బాటిల్ పగిలిపోయి.. కాలిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని.. ఆ తర్వాత ఇంట్లో మంటలు వ్యాపించాయని పోలీసులు భావిస్తున్నారు. దోమల నివారణ లిక్విడ్ పెట్టగానే షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత ఇంట్లో పొగ వ్యాపించి ఉంటుందని.. పొగ కారణంగా ఊపిరి ఆడక నలుగురు చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన ఇంటిని ఫోరెన్సిక్ సిబ్బంది కూడా పరిశీలించారు. ఇంట్లోని టవర్ ఫ్యాన్‌లో మంటలు చెలరేగడం వల్ల ప్రమాదం జరిగిందని వారు భావిస్తున్నారు. ఈ రెండు కారణాలు ఇప్పటి వరకు అస్పష్టంగానే ఉన్నాయి. పూర్తి విచారణ జరిపి, పోస్టు మార్టం నివేదిక వచ్చాకే నలుగురు మృతికి గల కారణాల తెలియనున్నాయి. కాగా.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో బంధువులు, ఇటు స్థానికుల్లోనూ విషాధచాయలు అలుముకున్నాయి. మృతదేహాలను ప్రస్తుతం పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.