ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసును సీబీఐకి ఇవ్వాలి: మాయావతి

తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  7 July 2024 12:43 PM IST
Tamil Nadu, Armstrong, murder, Mayawati,

ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసును సీబీఐకి ఇవ్వాలి: మాయావతి 

తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కొందరు వ్యక్తులు ఆయన నివాసం వద్ద ఉండగా బైక్‌లపై వచ్చి హత్య చేశారు. అయితే.. ఆర్మ్‌స్ట్రాంగ్‌ మర్డర్‌ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆర్మ్‌స్ట్రాంగ్ మరణంపై పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదివారం నివాళులర్పించారు. బీఎస్పీ జాతీయ సమన్వయకర్త ఆకాశ్‌ ఆనంద్‌తో కలిసి తమిళనాడులోని చెన్నైకి చేరుకున్న ఆమె.. నేరుగా ఆర్మ్‌స్ట్రాంగ్ నివాసానికి వెళ్లారు. భౌతిక కాయానికి నివాళులర్పించారు.

నివాళులు అర్పించిన తర్వాత ఆర్మ్‌స్ట్రాంగ్‌ కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు. ఆర్మ్‌స్ట్రాంగ్ కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానని చెప్పారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్య కేసును తమిళనాడు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాని స్టాలిన్ సర్కార్‌ సీరియస్‌గా తీసుకుని పర్యవేక్షించాలంటూ మాయావతి పేర్కొన్నారు. ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటేనే నేరస్తులు దొరుకుతారనీ.. వారికి శిక్ష పడుతుందని మాయావతి అన్నారు. నిందితులను పట్టుకుంటేనే ప్రజలు కూడరా రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయని నమ్ముతారని వ్యాఖ్యానించారు.

Next Story