నీట్‌పై ప్రజలు విశ్వాసం కోల్పోయారు: హీరో విజయ్‌

ఇటీవల నీట్‌ యూజీ-2024 పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి.

By Srikanth Gundamalla  Published on  3 July 2024 12:30 PM IST
tamil, hero vijay, comments,  neet exam ,

 నీట్‌పై ప్రజలు విశ్వాసం కోల్పోయారు: హీరో విజయ్‌ 

ఇటీవల నీట్‌ యూజీ-2024 పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. పరీక్షలను కూడా రద్దు చేశారు అధికారులు. ఈ వ్యవహారం దేశంలో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే నీట్‌ అంశంపై తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌ తాజాగా స్పందించారు. ప్రజలు నీట్‌పై విశ్వాసం కోల్పోయారని చెప్పారు. సమస్యకు పరిష్కారంగా రాజ్యాంగాన్నే సవరించాలంటూ హీరో దళపతి విజయ్‌ తన అభిప్రాయాన్ని చెప్పారు.

హీరో దళపతి విజయ్‌ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ నీట్‌ పరీక్షల్లో జరిగిన అవకతవకలు.. ఆ తర్వాత పరిణామాలపై స్పందించారు. నీట్‌ పరీక్షపై ప్రజలు నమ్మకం కోల్పోయారని అన్నారు. దేశానికి నీట్ పరీక్ష అవసరంలేదని చెప్పారు. నీట్ నుంచి మినహాయింపు ఒక్కటే పరిష్కారం అని చెప్పారు. రాష్ట్ర అసంబ్లీలో నీట్‌కి వ్యతిరేకంగా ఆమోదించిన తీర్మానాన్ని స్వాగిస్తున్నట్లు హీరో దళపతి విజయ్ చెప్పారు. తమిళనాడు ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యను సమ్మళిత జాబితా నుంచి రాష్ట్ర జాబితా కిందకు తీసుకురావాలని దళపతి విజయ్‌ చెప్పారు. నీట్‌ పరీక్ష కారణంగా తమిళనాడులో పెద్ద సంఖ్యలో పేద, అర్హులైన, అట్టడుగున ఉన్న విద్యార్థులు విద్యను అభ్యసించలేకపోతున్నారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హీరో విజయ్ కోరారు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రత్యేక ఉమ్మడి జాబితాను రూపొందించడానికి రాజ్యాంగాన్ని సవరించాలని అభిప్రాయపడ్డారు. ఇందులో విద్య, ఆరోగ్యాన్ని కూడా జోడించాలన్నారు తమిళ హీరో దళపతి విజయ్.

Next Story