పరిశుభ్రతలో టాప్‌ ఇండోర్‌... టాప్‌-10లో ఏపీలోని మూడు సిటీలు

దేశంలో అత్యంత పరిశుభ్రంగా ఉన్న నగరాల జాబితాను విడుదల చేశారు.

By Srikanth Gundamalla  Published on  11 Jan 2024 6:04 PM IST
swachh survekshan, awards, president, indore,

పరిశుభ్రతలో టాప్‌ ఇండోర్‌...టాప్‌-10లో ఏపీలోని మూడు సిటీలు

దేశంలో అత్యంత పరిశుభ్రంగా ఉన్న నగరాల జాబితాను విడుదల చేశారు. ఈ లిస్ట్‌లో మొదటిస్థానంలో మరోసారి ఇండోర్‌ నగరం నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2023 అవార్డుల్లో వరుసగా ఏడోసారి తొలిస్థానాని ఇండోర్ నగరం కైవలం చేసకుంది. ఇండోర్‌ నగరంతో పాటు గుజరాత్‌లోని సూర్‌కూడా క్లీనెస్ట్‌ సిటీ తొలి ర్యాంక్‌ను సంయుక్తంగా గెలుచుకుంది. ఈ జాబితాలో మహారాష్ట్రలోని ముంబై మూడో స్థానంలో నిలిచింది.

ఇక పరిశుభ్రత నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఏపీలో విశాఖపట్నం నాలుగో స్థానంలో నిలవగా.. విజయవాడ ఆరో స్థానం, తిరుపతి ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరం తొమ్మిదో స్థానంలో నిలిచింది. టాప్‌-10 క్లీనెస్ట్‌ సిటీల్లో నాలుగు స్థానాల్లో తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు నిలిచాయి. ఇక టాప్‌ 100 లిస్ట్‌లో తమిళనాడు నుంచి ఏ నగరం కూడా ఎంపిక కాలేదు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులో చెన్నై 199వ స్థానంలో నిలిచింది.

ఇక క్లీనెస్ట్‌ ఇండియన్‌ స్టేట్స్‌ జాబితాలో తొలి స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. రెండోస్థానంలో మధ్యప్రదేశ్, మూడో స్థానంలో చత్తీస్‌గఢ్, నాలుగోస్థానంలో ఒడిశా నిలిచింది. తెలుగు రాష్ట్రాలు వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో తెలంగాణ, ఏపీ దక్కించుకున్నాయి. తమిళనాడు క్లీనెస్ట్‌ స్టేట్స్‌ జాబితాలో పదో స్థానం దక్కించుకుంది. ఇక స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అందించారు. కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Next Story