స్పైస్‌ జెట్‌కు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్

స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థకు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

By Srikanth Gundamalla  Published on  11 Sept 2023 6:28 PM IST
supreme court, warning, spicejet, chairman,

స్పైస్‌ జెట్‌కు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ 

స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థకు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. క్రెడిట్ సూయిస్‌ కేసులో స్పైస్ జెట్‌కు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో బకాయిల చెల్లింపు విషయంలో స్పైస్‌జెట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ అజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశౄలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఈ మేరకు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఒప్పందం ప్రకారం మిలియన్ డాలర్ల బకాయిలను చెల్లింపులో స్పైస్‌జెట్ కావాలనే తాత్సారం చేస్తోందని.. అందుకుగాను అజయ్‌సింగ్, స్పైస్‌జెట్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ ఏడాది మార్చిలో క్రెడిట్ సూయిస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారి పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.

సెప్టెంబర్ 15వ తేదీలోగా క్రెడిట్ సూయిస్‌కి వాయిదాల రూపంలో 5లక్షల డాలర్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే డిఫాల్ట్‌ చేసిన మొత్తానికి ఒక మిలియన్ డాలర్లు చెల్లించాలని స్పైస్‌జెట్‌కు సుప్రీంకోర్టు సూచించింది. ఒక వేళ ఈ మనీ కట్టకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థను హెచ్చరించింది. బకాయిలు చెల్లించకపోతే అజయ్‌ సింగ్‌ జైల్‌కు వెళ్లాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ప్రతి విచారణలోనూ కోర్టుకు హాజరు కావాలని సింగ్‌ను ఆదేశించింది. ఇక చాలు..మీరు సంస్థను మూసివేసినా ..బాధలేదు. కానీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందే ఇక డిల్లీ-డాలీ బిజినెస్‌ను కట్టిపెట్టండి అంటూ కోర్టు ఆగ్రహ్యం వక్తం చేసింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబరు 22కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Next Story