నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్‌పై సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్
నీట్-యూజీ 2024 పరీక్షల్లో అవకతవకలు జరిగడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 22 July 2024 2:00 PM ISTనీట్ ప్రశ్నాపత్రం లీకేజ్‌పై సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్
నీట్-యూజీ 2024 పరీక్షల్లో అవకతవకలు జరిగడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆసక్తికర కామెంట్స్ చేసింది. నిందితులకు మే 4వ తేదీన రాత్రి గుర్తించుకోవాలని చెప్పారంటే..లీక్ ఆ తేదీ కంటే ముందే జరిగి ఉండొచ్చని సీజేఐ డీవై చంద్రచూడ్ అనుమానం వ్యక్తం చేశారు. అలా అయితే స్ట్రాంగ్ రూమ్ వాలెట్‌లో ప్రశ్నాపత్రం బయటకు వచ్చిందా అని చంద్రచూడ్ ప్రశ్నించారు.
బిహార్ పోలీసుల రిపోర్టు ప్రకారం సంబంధిత బ్యాంకుల్లో ప్రశ్నపత్రాలను డిపాజిట్ చేయటానికి ముందే లీకైందని.. పిటిషనర్ల పక్షాన వాదిస్తున్న న్యాయవాది నరేందర్ హుడా పేర్కొన్నారు. 161 వాంగ్మూలాలు పేపర్ లీక్ మే 4వ తేదీ కంటే ముందే చోటుచేసుకొందని బలంగా చెబుతున్నట్లు తెలిపారు. మే 3న లేదంటే ఇంకా ముందే పేపర్ బయటకు వెళ్లి ఉండొచ్చని కోర్టు ముందు చెప్పారు. ఐదు పది మంది కోసం కాదనీ..చాలా మంది ఇందులో ఉండొచ్చని హుండా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎప్పటి నుంచో గ్యాంగ్ ఈ పని చేస్తుందని చెప్పారు. సంజీవ్ ముఖియా, ఇతర కీలక నిందితులు అరెస్టు కాలేదనే విషయాన్ని గుర్తు చేశారు.
నీట్ యూజీ 2024 ప్రశ్నా పత్రాల లీకేజ్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నుంచి విచారిస్తోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జె.బి పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా త్రిసభ్య ధర్మాసనం ఈ విషయంలో విచారణ జరుపుతోంది.