సర్కార్ కీలక నిర్ణయం.. మాస్క్ ధరించకుంటే రూ.2 వేల జరిమానా..
Rs 2,000 fine for not wearing mask in Delhi.. కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. దీంతో ఆయా
By సుభాష్ Published on 19 Nov 2020 11:00 AM GMTకరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో మళ్లీ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక దేశ రాజధానిని ఢిల్లీని గత కొంతకాలంగా కరోనా వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తికి కళ్లెం వేయడమే లక్ష్యంగా బహిరగ ప్రదేశాల్లో మాస్క్ ధరించిని వారికి రూ. 2 వేలు జరిమానా విధించనున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఇప్పటి వరకు రూ.500లుగా ఉన్న జరిమానాను రూ.2వేలకు పెంచినట్లు ఆయన తెలిపారు.
కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత తరుణంలో కరోనా వ్యాప్తిని నివారించాలంటే కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి వచ్చారు. చాలా మంది మాస్కులు పెట్టుకోవటంలేదని గ్రహించిన సర్కార్.. ఈ రోజు నుంచి మాస్కులు ధరించకుంటే 2000 రూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించింది. అనంతరం మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉండడంతో.. అదనంగా ఐసీయూ బెడ్‌లు, ఇతర వసతులు సమకూర్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులను పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఛత్‌పూజాను అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నామన్నారు. ఒకేసారి 200 మంది నది వద్దకు వెళ్తే.. వారిలో ఒక్కరికి కరోనా ఉన్నా.. మిగతా వారికి సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారని క్రేజివాల్ తెలిపారు. ఒకే సారి భారీ సంఖ్యలో నది వద్దకు వెళ్లడంపై నిషేదం విదించామని తెలిపారు. ఈ వేడుకలను ఇళ్లలోనే జరుపుకోవాలని పిలుపునిచ్చారు.