రెమాల్‌ తుపాను ఎఫెక్ట్.. కొండచరియలు విరిగిపడి 27 మంది మృతి

పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో రెమాల్ తుపాను బీభత్సం సృష్టించింది.

By Srikanth Gundamalla  Published on  29 May 2024 7:53 AM IST
remal cyclone,  27 dead,  mizoram,

రెమాల్‌ తుపాను ఎఫెక్ట్.. కొండచరియలు విరిగిపడి 27 మంది మృతి

పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో రెమాల్ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా మిజోరాంలోని ఐజ్వాల్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏకంగా 27 మంది చనిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వర్షాల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో.. వారు చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ సంఘటనపై స్పందించిన మిజోరాం సీఎం సంతాపం తెలుపుతూ.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. రాష్ట్ర విపత్తు సహాయ నిధికి రూ.15 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మరోవైపు మీతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.4లక్షల చొప్పున పరిహారం అందిస్తుందని తెలిపారు.

తుపాను కారణంగా భారీ వర్షాలు పడ్డాయి. దాంతో.. పలుచోట్ల ఈదుగాలులు సంభవించాయి. ఈదాంతో.. చెట్లు విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఇంకొన్ని చోట్ల కొంచరియలు విరిగిపడ్డాయి. ఐజ్వాల్‌ జిల్లాలో ఒక రాతి గని కూలిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు మైనర్లతో పాటు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది ఆచూకీ దొరకడం లేదని మిజోరాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ పేర్కొంది. ఇక వారి కోసం సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు వారు చెప్పారు. ఐజ్వల్‌ దక్షిణ శివార్లలోని మెల్తామ్, హ్లిమెన్ మధ్య ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు.

మరోవైపు మేఘాలయలో కూడా భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 500 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. తూర్పు జైంతియా హిల్స్‌లో కారు ప్రమాదం సంభవించగా ఒకరు చనిపోగా.. ఖాసీ హిల్స్‌ జిల్లాలో మరొకరు చనిపోయారని అధికారులు చెప్పారు. 24 గంటలుగా వర్షం పడుతుండటంతో తీవ్ర నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. అసోంలో కూడా భారీ వర్షం కారణంగా ముగ్గురు చనిపోయారు.

Next Story