బీసీసీఐ కార్యదర్శి జై షాకు అరుదైన గౌరవం

బీసీసీఐ కార్యదర్శి జై షాకు అరుదైన గౌరవం దక్కింది.

By Srikanth Gundamalla  Published on  5 Dec 2023 5:51 AM GMT
award,  BCCI Secretary, Jai Shah,

బీసీసీఐ కార్యదర్శి జై షాకు అరుదైన గౌరవం

బీసీసీఐ కార్యదర్శి జై షాకు అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్‌ స్పోర్ట్స్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఇప్పటి వరకు ఎవరికీ దక్కని గౌరవం ఆయన్ని వరించింది. 2023 ఏడాదికి గాను జై షాకు బెస్ట్ స్పోర్ట్స్‌ బిజినెస్‌ లీడర్‌గా ఎంపిక అయ్యారు. ఈ అవార్డును కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (CII) ప్రకటించింది. అయితే.. ఈ అవార్డును స్పోర్ట్స్‌ బిజినెస్‌ అవార్డుల విభాగంలో ప్రతి ఏడాది ప్రకటిస్తారు. జై షాతో పాటు రిలయన్స్ ఫౌండేషన్‌ చైర్‌ పర్సన్‌ నీతా అంబానీ, డాక్టర్‌ సమంత కూడా ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు.

ఈ ముగ్గురూ కూడా క్రీడా రంగానికి సంబంధించిన వ్యాపారంలో అసాధారణ నాయకత్వం కనబరిచారని.. అవార్డు నిర్వాహకులు వీరిని ఎంపిక చేశారు. జై షా ఆధ్వర్యంలో ఇటీవల ఇండియాలో వన్డే వరల్డ్‌ కప్‌.. దానికి ముందు శ్రీలంకలో ఆసియా కప్‌ జరిగిన విషయం తెలిసిందే. జై షా ప్రత్యేక చొరవతోనే మహిళల ఐపీఎల్ (WPL) కూడా పుట్టుకొచ్చింది. జై షా ఆధ్వర్యంలోనే మహిళా క్రికెటర్లు పురుష క్రికెటర్లతో సమాన వేతన హక్కు లభించింది. ఇలాంటి మార్పులు తీసుకొచ్చినందుకు.. అలాగే టోర్నీలను విజయవంతంగా నిర్వహించినందుకు క్రీడా రంగానికి చెందిన బీసీసీఐ కార్యదర్శి జైషాకు బెస్ట్ స్పోర్ట్స్‌ బిజినెస్‌ లీడర్‌ అవార్డు దక్కింది.

ఇటీవల భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌ కప్‌-2023ని .. బీసీసీఐ కార్యదర్శిగా జై షా విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే జై షాకు అంతర్జాతీయ స్థాయి స్థాయిలో గుర్తింపు లభించింది. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చే విషయంలోనూ జై షా కీలక పాత్ర పోషించారు. క్రికెట్‌కు జైషా చేసిన ఈ సేవలను గుర్తించే సీఐఐ బెస్ట్‌ స్పోర్ట్స్‌ బిజినెస్‌ లీడర్‌గా ఎంపిక చేసింది.

Next Story