పూరీ రత్నాభాండాగారంలో ఆయుధాలు గుర్తింపు
పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారాన్ని ప్రభుత్వం తెరిచిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 21 July 2024 3:00 AM GMTపూరీ రత్నాభాండాగారంలో ఆయుధాలు గుర్తింపు
పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారాన్ని ప్రభుత్వం తెరిచిన విషయం తెలిసిందే. ఇందలో తాజాగా విలువైన వస్తువుల తరలింపు సందర్భంగా గత యుద్ధాల్లో ఉపయోగించిన కత్తులు, ఈటెలు, బరిశెలు వంంటి పురాతన ఆయుధాలు బయటపడ్డాయి. లోపలి గదిలోని చెక్కె పెట్టెల వద్ద ఈ ఆయుధాలు కనిపించాయని అధికారులు చెప్పారు. అయితే.. లభించిన ఆయుధాలు చాలా బరువుగా ఉన్నాయని అన్నారు. నలుపు రంగులోకి మారాయని ట్రెజరీలోకి ప్రవేశించిన కమిటీ సభ్యుడు ఒకరు వెల్లడించారు. యుద్ధ సామగ్రిని తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచామని కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ చెప్పారు. ప్రస్తుతం లభించిన పురాతన ఆయుధాలను అప్పటి రాజులు రత్నభాండాగారంలో దాచి ఉంచవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ మేరకు మాట్లాడిన జస్టిస్ బిశ్వనాథ్... తాము రహస్యగది నుంచి తాత్కాలిక ఖజానాకు తరలించిన సంపద వివరాలు బహిర్గతం చేయరాదని, చూసింది మనసులో ఉంచుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో స్వామి ఆభరణాలతో పాటు యుద్ధాస్త్రాలున్నాయని, ఈ సామగ్రి భద్రంగా ఖజానాలో ఉంచి సీల్ చేశామని, అంతా వీడియో కూడా తీయించామని బిశ్వనాథ్ అన్నారు.
కాగా.. రత్నాభాండాగారం మరమ్మతులకు ఎంత సమయం పడుతుందనేది ఇప్పుడే చెప్పలేమని బిశ్వనాథ్ చెప్పారు. ఈ పనులు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జరుగుతాయన్నారు. రహస్య సొరంగ మార్గం అన్వేషనకు సంబంధించి పనులు పూర్తయిన తర్వాత తాము సమావేశం అవుతామన్నారు జస్టిస్ బిశ్వనాథ్.