పుణె టీనేజర్‌ ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్.. ఇద్దరు డాక్టర్లు అరెస్ట్

మహారాష్ట్రలోని పుణెలో ఇటీవల టీనేజర్‌ పోర్ష్‌ కారు ర్యాష్‌ డ్రైవింగ్ చేసి ఇద్దరు చనిపోవడానికి కారణమైన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  27 May 2024 6:33 AM GMT
pune, rash driving case,  twist, two doctors arrest ,

పుణె టీనేజర్‌ ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్.. ఇద్దరు డాక్టర్లు అరెస్ట్ 

మహారాష్ట్రలోని పుణెలో ఇటీవల టీనేజర్‌ పోర్ష్‌ కారు ర్యాష్‌ డ్రైవింగ్ చేసి ఇద్దరు చనిపోవడానికి కారణమైన విషయం తెలిసిందే. అయితే..తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడు మైనర్‌ బ్లడ్‌ టెస్టు రిజల్ట్‌ను ఇద్దరు వైద్యులు మార్చేసినట్లు గుర్తించారు. తాజగా వారిపై చర్యలను తీసుకుంటున్నారు పోలీసులు.

సాసూన్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ అజేయ్‌ తావ్‌రే, డాక్టర్ శ్రీహరి హార్నూర్‌ను పుణె క్రైం బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుణెలోని ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌ తావ్‌రే ఫోరెన్సిక్‌ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అబ్జర్వేషన్‌ హోమ్‌లో ఉన్న మైనర్‌ రక్త నమూనాల్లో ఎలాంటి ఆల్కహాల్ ఆనవాళ్లు లేవని ఈ వైద్యుడు నివేదిక ఇచ్చాడు. కానీ.. పోలీసులు అనుమానంతో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా నిందితుడు మిత్రులతో కలిసి మద్యం తాగినట్లు కనిపెట్టారు. దాంతో.. ఇద్దరు డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.

కాగా.. ఈ కేసులో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో.. పోలీసులు కూడా కేసును సీరియస్‌గా తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా సీపీ అమితేష్‌ కుమార్ మాట్లాడారు. ఇదేదో మద్యం మత్తులో చేసిన యాక్సిడెంట్ కాదని చెప్పారు. నిందితుడు మరైనర్‌కు తాను పార్టీ చేసుకుంటూ ఆల్కాఆల్ తాగిన విషయం స్పష్టంగా తెలుసు.. అలాంటి పరిస్థితుల్లో కారు నడిపితే రోడ్డుపై వారి ప్రాణాలకు ప్రమాదమన్న విషయంపై అతనికి పూర్తి అవగాహన కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.

కాగా.. ఈ ప్రమాదం గత ఆదివారం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం బాలుడికి జువైనల్ కోర్డు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించింది. ఇక తాజాగా డాక్టర్లు కూడా కేసులో నుంచి బాలుడిని తప్పించేందుకు ప్రయత్నించడంతో మరింత సంచలనంగా మారింది కేసు .

Next Story