పుణె మైనర్ డ్రైవింగ్ కేసులో మరో ట్విస్ట్‌.. బాలుడి తల్లి అరెస్ట్

పుణెలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం సంచలనంగా మారింది.

By Srikanth Gundamalla  Published on  1 Jun 2024 4:30 AM GMT
pune, minor accident case,  mother arrest ,

 పుణె మైనర్ డ్రైవింగ్ కేసులో మరో ట్విస్ట్‌.. బాలుడి తల్లి అరెస్ట్

పుణెలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం సంచలనంగా మారింది. ఒక మైనర్‌ కారును అతివేగంగా నడపడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఈ కేసులో మైనర్‌ను తప్పించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంతో.. పోలీసులు ఒక్కో ట్విస్ట్‌ను వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం నడిపి మైనర్‌ కారు నడిపితే.. వారు తప్పుడు రిపోర్ట్ ఇచ్చినట్లు చెప్పారు. ఇక తాజాగా మరో ట్విస్ట్‌ వెలుగు చూసింది. మైనర్‌ బాలుడి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోర్షే కారు ప్రమాదం కేసులో యువకుడి రక్త నమూనాలను అతని తల్లితో మార్చుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దాంతో.. మైనర్‌ తల్లి శివాని అగర్వాల్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అర్ధరాత్రి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి పూణె వచ్చిన తర్వాత ఆమె ఆచూకీ లభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని నగర పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ప్రమాదంపై దర్యాప్తు జరపగా.. బాలుడి రక్త నమూనాలను అతని తల్లికి మార్చినట్లు తేలిందని పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ చెప్పారు.

అయితే.. ప్రమాదం జరిగిన తర్వాత ఫోరెన్సిక్‌ సైన్‌ లేబొరేటరీ నివేదికలో యువకుడి మొదటి రక్త నమూనాలో ఆల్కాహాల్ లేదని తేలింది. దాంతో.. అనుమానం వ్యక్తం అయ్యింది. తర్వాత మరో ఆస్పత్రిలో పోలీసులు రెండోసారి పరీక్షలు చేశారు. అప్పుడు ఆల్కాహాల్‌ను గుర్తించారు. ఈ క్రమంలోనే సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించిన ఇద్దరు వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రక్త నమూనాలను అతని తల్లికి మార్చినట్లు సీపీ అమితేష్ చెప్పారు. ఇదే విషయాన్ని రెండ్రోజుల క్రితం కోర్టుకు తెలిపారు. తాజాగా ముంబై నుంచి పుణెకు వచ్చిన మైనర్‌ తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు 17 ఏళ్ల మైనర్‌ను అబ్జర్వేషన్‌ హోమ్‌కు పంపినట్లు చెప్పారు. మద్యం మత్తులో రోడ్డుపై గంటకు 200 కిలో మీటర్ల వేగంతో కారు నడిపినట్లు పోలీసులు చెబుతున్నారు.

Next Story