శబరిమలలో పేలుడు పదార్థాల కలకలం
Police found explosives in Sabarimala Thiruvabharanam.శబరిమలకు భారీ ముప్పు తప్పింది. శబరిమలకు సమీపంలో
By M.S.R Published on 20 Jan 2022 1:17 PM ISTశబరిమలకు భారీ ముప్పు తప్పింది. శబరిమలకు సమీపంలో పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరువాభపురం ఊరేగింపు తిరుగు పయనయం కావడానికి కొద్ది గంటల ముందే ఈ పేలుడు పదార్ధాలు లభ్యం కావడం కలకలం రేపుతోంది. శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో పేలుడు పదార్థాలను కనుగొనడంతో పోలీసులు, ఆలయ అధికారులు అలెర్ట్ అయ్యారు. శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో పెన్ ఘాట్ వంతెన కింద జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 6 జిలెటిన్ స్టిక్స్ లను స్వాధీనం చేసుకున్నారు. బాంబ్ స్వ్యాడ్ మొత్తం తనిఖీలు చేస్తున్నారు.
పతనంతిట్ట జిల్లాలోని వడస్సెరిక్కరాలోని పెంగట్ వంతెన కింద ఆరు జిలిటెన్ స్టిక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. బ్రిడ్జి కింద పేలుడు పదార్ధాలను పోలీసులు గుర్తించారు. పేలుడు పదార్ధాలను బాంబు స్వ్కాడ్ నిర్వీర్యం చేసింది. శబరిమల నుండి తిరువాభరణం మోసుకెళ్లే పేటికను ఈ నెల 21న తెల్లవారుజామున 4 గంటలకు ఈ రహదారి గుండా పందళానికి తీసుకెళ్లాల్సి ఉంది. అయ్యప్పకు అలంకరించిన ఆభరణాలను తిరిగి తీసుకెళ్లే సమయానికి కొన్ని గంటల ముందే పేలుడు పదార్ధాలు లభ్యం అయ్యాయి. కరోనా నేపథ్యంలో ట్రావెన్ కోర్ బోర్డు, అధికారులు మకర జ్యోతి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేశారు.