విరాట్‌ కోహ్లీకి చెందిన పబ్‌పై పోలీస్ కేసు నమోదు

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అందరికీ తెలుసు.

By Srikanth Gundamalla
Published on : 9 July 2024 12:42 PM IST

police case, virat kohli, one8 commune, bangalore,

 విరాట్‌ కోహ్లీకి చెందిన పబ్‌పై పోలీస్ కేసు నమోదు 

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అందరికీ తెలుసు. ఆయన క్రికెట్‌ బ్యాటింగ్‌లో రికార్డులు సృష్టించాడు. ఇటీవల టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. విరాట్‌ క్రికెట్‌తో పాటు పలు వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆయన వన్‌8 కమ్యూన్‌ పబ్‌లకు యజమానిగా ఉన్నాడు. దేశంలోని పలు చోట్ల ఈ బ్రాంచ్‌లు ఉన్నాయి. తాజాగా.. బెంగళూరులోని ఈయన పబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా నిర్వహణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే వన్8 పబ్‌పై కేసు నమోదు చేశామని వెల్లడించారు.

బెంగళూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నస్వామి స్టేడియం దగ్గరే కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్‌తో పాటు మరికొన్ని పబ్‌లు ఉన్నాయి. అయితే.. ఇవి నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి తర్వాత కూడా పెద్దశబ్ధంతో సంగీతం వినిపిస్తోందని ఫిర్యాదుదారులు పేర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. రాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఉన్నా.. ఆ సమయం దాటిన తర్వాత కూడా కార్యక్రమాలను కొనసాగించారు. దాంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని క్లోజ్ చేయించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. అలాగే ప్రస్తుతం వన్‌8 కమ్యూన్ మేనేజర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story