ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్ అందాలను త్వరలో మెట్రో రైలు ప్రయాణికులు వీక్షించవచ్చు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఆగ్రాలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు ప్రధాని నరేంద్రమోదీ సోమవారం (ఈరోజు) ఉదయం 11.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. కాగా, ఈ మెట్రో రైలు నిర్మాణ పనులు డిసెంబర్ 7న ప్రారంభమవుతాయి. రెండు కారిడార్లలో చేపడుతున్న ఈ మెట్రో ప్రాజెక్టు వల్ల ఆగ్రా ప్రజలకు ఎంతో సౌకర్యం కలుగనుంది. నగర అందాలను సైతం వీక్షించే పర్యాటనలకు ప్రయోజనం కలుగనుంది అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
రూ. 8379.౬౨ కోట్లతో యూపీ సర్కార్ ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీనిని ఐదేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంగా పనులు చేయనుంది. రెండు కారిడార్లలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు 294 కిలోమీటర్లు. మెట్రో రైలు మార్గాన్ని ఆగ్రాలోని ప్రధాన ప్రాంతాలతో పాటు తాజ్‌మహల్, ఆగ్రా కోట, సికంద్ర పర్యాటక కేంద్రాలతో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లను అనుసంధానిస్తూ నిర్మించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌పూరి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పాల్గొననున్నారు.