ఎన్టీఆర్ స్మారక నాణేన్ని విడుదల చేసిన రాష్ట్రపతి

రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ స్మారణ నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.

By Srikanth Gundamalla  Published on  28 Aug 2023 12:14 PM IST
NTR, Rs.100 Coin, Release, President Murmu,

ఎన్టీఆర్ స్మారక నాణేన్ని విడుదల చేసిన రాష్ట్రపతి 

రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ స్మారణ నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్‌, ఎన్టీఆర్ కుఆర్తె పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర్లు, హీరో బాలకృష్ణ, నారా బ్రాహ్మిణి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. టీడీపీ ఎంపీలు కనకమేడల, గల్లా జయదేవ్‌, కేశినేని నాని, రామ్మోహన్‌ నాయుడు, రఘురామ కూడా పాల్గొన్నారు.

భారతీయ సినిమా చరిత్రలో నందమూరి తారకరామారావు ఎంతో ప్రత్యేకమని.. రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము అన్నారు. రాముడు, కృష్ణుడు వంటి పాత్రల్లో ఎన్టీఆర్ తన నటనతో ఆకట్టుకున్నారని చెప్పారు. రాముడంటే ఎన్టీఆర్‌లానే ఉంటారా అనేలా చేశారని చెప్పారు. సామాజిక న్యాయం కోసం ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఎన్టీఆర విలక్షణ వ్యక్తిత్వాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉండరని.. ఆయన కుమార్తె పురందేశ్వరి అన్నారు. మహిళకు ఆస్తిలో హక్కు కల్పించింది ఎన్టీఆరే అని గుర్తు చేశారు. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా ఉండిపోతారని చెప్పారు. తిరుపతిలో మహిళా వర్సిటీ ఏర్పాటు చేశారని అన్నారు. ఎన్టీఆర్ ఒకతరం హీరో మాత్రమే కాదని.. అన్ని తరాలకు ఆదర్శ హీరో అని కొనియాడారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని పురందేశ్వరి కొనియాడారు.

Next Story