నీట్ యూజీ కౌన్సిలింగ్‌ను వాయిదా వేసిన ఎన్‌టీఏ
ఇటీవల నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న అంశం సంచలనంగా మారింది. వై
By Srikanth Gundamalla Published on 6 July 2024 8:00 AM GMTనీట్ యూజీ కౌన్సిలింగ్‌ను వాయిదా వేసిన ఎన్‌టీఏ
ఇటీవల నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న అంశం సంచలనంగా మారింది. వైద్య విద్య కోర్సుల్లో అక్రమాలు జరగడమేంటంటూ ఈ వివాదం తీవ్ర దుమారం రేపింది. అయితే.. తాజాగా నీట్ యూజీ కౌన్సిలింగ్‌ను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వాయిదా వేసింది. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ జూలో ఆరో తేదీనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ..పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వాయిదా వేశారు అధికారులు. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు వరకు వాయిదా కొనసాగుతుందని ఎన్టీఏ పేర్కొంది.
కొత్త తేదీలను కేంద్ర విద్యశాఖ ప్రకటిస్తుందని ఎన్టీఏ తెలిపింది. నీట్ కౌన్సిలింగ్‌ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినా కూడా.. ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. కాగా.. ఈ ఏడాది మే 5వ తేదీన దేశంలో నీట్ యూజీ-2024 పరీక్షను నిర్వహించారు. పరీక్ష పేపర్ లీక్ అవడంతో పాటు.. నిర్వహణలో అవకతవకలు జరిగాయని వార్తలు వచ్చాయి. దాంతో.. విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు చేశారు. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయ మొదటి ర్యాంకు రావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అలాగే నీట్ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం సహా పలు అంశాలు న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు, నీట్ రద్దు చేయాలని డిమాండ్లు వచ్చాయి. దాదాపు సుప్రీంకోర్టులో 26 పిటిషన్లు దాఖలయ్యాయి.
పిటిషన్లపై ఇప్పటికే విచారణ జరిపిన న్యాయస్థానం.. కౌన్సిలింగ్‌ను వాయిదా వేయలేమంటూ తోసిపుచ్చింది. ద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించి సవరించిన నీట్ ర్యాంకుల జాబితాను ఎన్‌టీఏ విడుదల చేసింది. ఈ క్రమంలోనే అక్రమాల ఆరోపణలపై కేంద్రం, ఎన్‌టీఏ శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానానికి అఫిడవిట్లు సమర్పించాయి. నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయతీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ పిటిషన్లపై విచారణ జులై 8న జరగనుంది. ఈ క్రమంలోనే కౌన్సిలింగ్‌ను ఎన్టీఏ వాయిదా వేసింది.