'నివర్‌' తుఫాను: మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు: వాతావరణ శాఖ

Nivar cyclone ... బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న వాయుగుండం పుదుచ్చేరికి 600 కిలోమీటర్ల

By సుభాష్  Published on  23 Nov 2020 1:13 PM IST
నివర్‌ తుఫాను: మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు: వాతావరణ శాఖ

బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న వాయుగుండం పుదుచ్చేరికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరో 24 గంటల్లో ఈ వాయుగుండం తుఫానుగా బలపడనుంది. పుదుచ్చేరి కరైంకల్‌- మామళ్లపురం మధ్య ఈ నెల 25న తుఫాను తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుఫాకు 'నివర్‌' అనే పేరు పెట్టనున్నారు. ఇరాన్‌ దేశం ఈ పేరును సూచించింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రతో పాటు తమిళనాడులోని ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

ఏపీలో వచ్చే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే తమిళనాడు, తెలంగాణలోనూ ఇదే స్థాయి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొన్ని చోట్ల సాధారణ వర్షాలు, అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తీవర ప్రాంతంలో గంటకు 45 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయని, మత్స్య కారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఈ తుఫాను ప్రభావం 26వ తేదీ వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Next Story