ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్‌ కుమార్‌

Nitish Kumar Takes Oath as Bihar CM .. బీహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్‌ (69) ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా నాలుగో

By సుభాష్  Published on  16 Nov 2020 12:26 PM GMT
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్‌ కుమార్‌

బీహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్‌ (69) ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా మరోసారి సీఎం పీఠాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఏడోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికైన ఘటన నితీష్‌ కుమార్‌దే. సోమవారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ ఫగు చౌహాన్‌ నితీష్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నత కేంద్ర మంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డా హాజరయ్యారు.

కాగా, ఉత్కంఠ పోరులో విజయాన్ని సొంత చేసుకున్న ఎన్డీయే కొత్త సర్కార్‌ కొలువుదీరింది. బీజేపీ నుంచి ఏడుగురికి, జేడీయూ నుంచి ఐదుగురికి కేబినెట్‌లో చోటు దక్కగా, ఉప ముఖ్యమంత్రి పదవులను బీజేపీ సొంతం చేసుకుంది. 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక డిప్యూటీ ముఖ్యమంత్రులగా బీజేపీ నేతలు తార్‌కిశోర్‌ ప్రసాద్‌, రేణూ దేవీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆదివారం సమావేశమైన ఎన్డీయే శాసన సభ పార్టీ నాయకులు నితీష్‌ కుమార్‌ను నాయకుడిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. అయితే 20 ఏళ్లలో ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి దేశ రాజకీయల్లోనే అరుదైన రికార్డు సృష్టించారు నితీష్‌ కుమార్‌.

Next Story
Share it