ఏడాది తర్వాత కాఫీ డేకు కొత్త సీఈవో.. ఎవ‌రంటే..?

New ceo of coffee day ... కెఫే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మ‌ర‌ణం త‌రువాత ఏడాదికి

By సుభాష్  Published on  8 Dec 2020 11:32 AM IST
ఏడాది తర్వాత కాఫీ డేకు కొత్త సీఈవో.. ఎవ‌రంటే..?

కెఫే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మ‌ర‌ణం త‌రువాత ఏడాదికి ఆ సంస్థ‌కు కొత్త సీఈవో వ‌చ్చారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ కుమార్తె, కాఫీడే వ్యవస్థాపకుడు అయిన సిద్ధార్థ భార్య మాళివిక హెగ్డే నూతన సీఈవోగా నియమితులయ్యారు. ఈ మేరకు కాఫీ డే సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అప్పుల్లో ఉన్న కాఫీడే సంస్థ‌ను తిరిగి నిల‌బెట్టుకునేందుకు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు ఆమె గ‌తంలో చెప్పారు. సీఈవోతో పాటు అద‌న‌పు డైరెక్ట‌ర్లుగా సీహెచ్ వ‌సుంధ‌రా దేవీ, గిరి దేవ‌నూర్ మోహ‌న్ రాఘ‌వేంద్ర‌ను సంస్థ బోర్డు నియ‌మించింది. వీరు 2025 వ‌ర‌కు ఆయా ప‌ద‌వుల్లో కొన‌సాగుతారిన బోర్డు వెల్ల‌డించింది.

గతేడాది సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. ఆయన మరణం తర్వాత గతేడాది జూలైలో స్వతంత్ర బోర్డు సభ్యుడు ఎస్‌.వి. రంగనాథ్‌ని తాత్కలిక చైర్మన్‌గా నియమించారు. ఈ నేపథ్యంలో నిన్న ఆయన భార్య మాళవిక హెగ్డేని సీఈఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరుకు చెందిన కెఫే కాఫీ డే భారతదేశం అంతటా వందలాది కాఫీ షాపులను నిర్వహిస్తోంది.

Next Story