నేపాల్‌లో విదేశీయులతో వెళ్తున్న హెలికాప్టర్‌ అదృశ్యం

నేపాల్‌లో ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్‌ అదృశ్యమైంది.

By Srikanth Gundamalla  Published on  11 July 2023 12:30 PM IST
Nepal, Helicopter, Missing,

నేపాల్‌లో విదేశీయులతో వెళ్తున్న హెలికాప్టర్‌ అదృశ్యం

నేపాల్‌లో ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్‌ అదృశ్యమైంది. అదృశ్యమైన హెలికాప్టర్‌ మేనేజింగ్‌ ఎయిర్‌కు చెందిన హెలికాప్టర్‌ 9ఎన్‌-ఏంఎవీ (ఏఎస్‌ 50)గా తెలిసింది. సోలుకుంబు నుంచి ఖాట్మాండు వెళ్తుండగా హెలికాప్టర్‌ అదృశ్యమైంది. హెలికాప్టర్‌ అదృశ్యమైన సమయంలో అందులో ఐదుగురు విదేశీయులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఐదుగురు విదేశీయులతో పాటు పైలట్‌ కూడా మిస్‌ అయ్యాడని చెప్పారు. మంగళవారం ఉదయం 10:12 గంటలకు రాడార్ నుంచి అదృశ్యమైందని నేపాల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆఫ్‌ అథారిటీ అధికారులు ట్విట్టర్‌ ద్వారా నిర్ధారించారు.

కాగా.. అదృశ్యమైన హెలికాప్టర్‌ను గుర్తించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. మరో హెలికాప్టర్‌ ద్వారా గాలింపు చేపట్టారు. హెలికాప్టర్‌ టేకాఫ్‌ తీసుకున్న 15 నిమిషాలకే అదృశ్యమైందని చెప్పారు. హెలికాప్టర్‌ ఆనవాళ్లు గుర్తించాక మరిన్ని వివరాలు తెలుపుతామని చెప్పారు అధికారులు

Next Story