నీటమునిగిన ముంబై, పుణె.. విద్యాసంస్థలు బంద్

మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి.

By Srikanth Gundamalla  Published on  26 July 2024 2:47 AM GMT
Mumbai, pune, heavy rain, educational institutions, closed ,

నీటమునిగిన ముంబై, పుణె..విద్యాసంస్థలు బంద్ 

మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. మరోవైపు మహానగరాలు వర్షాలు పడితే చిగురుటాకులా వణికిపోతాయి. అలాంటి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంతో పూర్తిగా నీటమునిగాయి. జలదిగ్బంధంలో నగర ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. మహారాష్ట్రలోని ముంబై, పుణెలు నీటి మునిగాయి. దాంతో.. ప్రజలకు అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. శుక్రవారం కూడా భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ముంబై, పుణెలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావొద్దనీ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

పుణె, థానే, పాల్ఘర్‌ నగరాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ప్రభుత్వ, ప్రయివేట్‌ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ముంబై, పూణే సహా పింప్రి, చించ్విడ్‌ నగరాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. భారీ వర్షాల కారణంగా ముంబైకు పలు విమాన సర్వీసులు రద్దు అయినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.దాంతో.. ఆయా ప్రాంతాలకు ఆరెంజ్, రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఇప్పటికే వర్సాల కారణంగా పలు చోట్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పుణెలోని దక్కన్‌ ప్రాంతంలో విద్యుదాఘాతంతో ముగ్గురు, తహమినీ ఘాట్‌లో కొండచరియలు పడి ఒకరు చనిపోయారు.

మరోవైపు పలు చోట్ల వరద నీటిలో ఇరుక్కున్న బాధితులను కాపాడేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ముంబైలో శాంటాక్రూజ్‌ ప్రాంతంలో జూలైలోనే అత్యధికంగా 150 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర చరిత్రలో జూలైలో రెండో అత్యంత భారీ వర్షపాతం ఇదే. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎయిర్‌పోర్టులో విమానరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 11 విమానాలను రద్దుచేశారు. మరికొన్ని విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు చెప్పారు.

Next Story