ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టిన ఐస్‌క్రీమ్‌లో చేతి వేలు.. షాక్‌ అయిన డాక్టర్

ఆన్‌లైన్‌లో వస్తువులు, ఫుడ్‌ ఆర్డర్‌ పెడుతూ ఉంటారు చాలా మంది.

By Srikanth Gundamalla  Published on  13 Jun 2024 9:30 AM GMT
mumbai, hand finger,  ice cream,

 ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టిన ఐస్‌క్రీమ్‌లో చేతి వేలు.. షాక్‌ అయిన డాక్టర్ 

ఆన్‌లైన్‌లో వస్తువులు, ఫుడ్‌ ఆర్డర్‌ పెడుతూ ఉంటారు చాలా మంది. అయితే.. ఎప్పుడో ఒకసారి ఆర్డర్‌ మిస్‌ అయి మరోటి రావడం వంటివి జరుగుతాయి. మనం ఆర్డర్‌ చేసినది కాకుండా మరోటి వస్తుంది. అయితే.. ముంబైలో మాత్రం ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్‌ ఆర్డర్‌ చేసుకున్న డాక్టర్‌కు.. అందులో చేతి వేలు వచ్చింది. తీనే సమయంలో అది చూసిన అతను భయపడిపోయాడు. దీనికి సంబంధించిన ఫొటోను అతను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. వైరల్‌ అవుతోంది.

ముంబైలోని పశ్చిమ మలాడ్‌లో ఉంటోన్న 26 ఏళ్ల డాక్టర్‌.. రాత్రి భోజనం చేసిన తర్వాత ఐస్‌క్రీమ్ తినాలని భావించాడు. దాంతో.. ఆన్‌లైన్‌లో బటర్‌ స్కాచ్‌ కోన్‌ ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్‌ పెట్టాడు. ఇక ఆర్డర్‌ డెలివరీ అయిన తర్వాత దాన్ని ఓపెన్‌ చేసి తినసాగాడు. ఈ క్రమంలో కోన్‌ ఐస్‌క్రీమ్‌లో అర అంగుళం మేర చేతి వేలు కనిపించింది. ఒక్కసారిగా అతను షాక్‌ అయ్యాడు. చేతి వేలుకి గోరుతో పాటు కండ పట్టిన చర్మం కూడా కనిపించడంతో ఆందోళన చెందాడు. వెంటనే ఈ సంఘటనపై అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వేలుని పరీక్షల కోసం ఫోరెన్సిక్‌కు పంపించారు. చేతి వేలు నిజమైనదేనా? నిజమైతే అది ఎవరిది..? అసలు ఐస్‌క్రీమ్‌లోకి ఎలా వచ్చింది అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ సంఘటనలో భాగంగా ఐస్‌క్రీమ్‌ కంపెనీ సిబ్బందిని కూడా ముంబై పోలీసులు విచారిస్తున్నారు.

Next Story