ముంబైలో ఆరు చోట్ల బాంబులు పెట్టామని బెదిరింపు.. పోలీసుల తనిఖీలు

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఇటీవల బాంబు బెదిరింపు కాల్స్‌ ఎక్కువయ్యాయి.

By Srikanth Gundamalla  Published on  2 Feb 2024 5:42 AM GMT
mumbai, bomb warning call, police, alert ,

ముంబైలో ఆరు చోట్ల బాంబులు పెట్టామని బెదిరింపు.. పోలీసుల తనిఖీలు

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఇటీవల బాంబు బెదిరింపు కాల్స్‌ ఎక్కువయ్యాయి. పలుమార్లు బెదిరింపు కాల్స్‌తో అలర్ట్‌ అయిన పోలీసులు తనిఖీలు చేశారు. అయితే.. ఎలాంటి ఆనావాళ్లు దొరకలేదు. తాజాగా మరోసారి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. ఏకంగా ఆరు చోట్ల బాంబులు పెట్టామని పోలీసులకు కాల్‌ రావడంతో కలకలం సృష్టించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.

శుక్రవారం ఉదయం ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తం ఫోన్‌ కాల్ చేశాడు. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో తాము బాంబులు పెట్టామని చెప్పాడు. అవి ఏ సమయంలోనైనా పేలొచ్చొంటూ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో.. పోలీసులు, క్రైమ్‌ బ్రాంచ్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు అలర్ట్‌ అయ్యారు. ముంబైలోని రద్దీగా ఉండే ఆయా ప్రాంతాల్లో తనిఖీలను చేపట్టారు. గతంలో కూడా ఇలాగే బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అప్పుడు పేలుడు పదార్థాలు ఏమీ లభించలేదు. ఈసారి కూడా అలాంటి ఫేక్‌ కాలే కావొచ్చని అనుమానించినా కూడా.. చాన్స్‌ తీసుకోవద్దనే ఉద్దేశంతో పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేశారు.

అయితే.. ఈ సారి కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దాంతో.. పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు ఈ బాంబు బెదిరింపు కాల్‌ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుదురు వ్యక్తి కోసం గాలింపు మొదలుపెట్టారు. ట్రాఫిక్‌ పోలీస్‌ హెల్ప్‌లైన్‌కు చెందిన వాట్సాప్‌ నంబర్‌కు కాల్‌ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story