జనవరి నుంచి మొబైల్ నంబర్ 11 అంకెలు
Mobile number from January ... టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది
By సుభాష్ Published on 26 Nov 2020 9:56 AM ISTటెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ల్యాండ్ ఫోన్ నుంచి మొబైల్ నెంబర్లకు కాల్ చేయాలంటే జీరో (0) యాడ్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ 10 అంకెలుంటే దానికి ముందు మరో అంకె '0'ను యాడ్ చేయాల్సి ఉంటుంది. దీనిపై ట్రాయ్ డిపార్ట్ మెంట్‌కు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం (DOT)గత మే నెలలోనే ప్రతిపాదించింది. డాట్ ప్రతిపాదనను అంగీకరిచింది.
దాంతో ఫిక్స్‌డ్‌లైన్, మొబైల్ సర్వీసుల మధ్య మరిన్ని నెంబర్లకు అవకాశం పెరిగింది. ఈ కొత్త విధానాన్ని జనవరి 1లోగా అమలు చేసేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ట్రాయ్ టెలికంలకు సూచించింది. డయిలింగ్ ప్యాట్రన్ మార్పుతో 2,554 మిలియన్ల నెంబర్లు అదనంగా లభించనున్న తెలిపింది. ల్యాండ్ నుంచి ల్యాండ్ లైన్ ఫోన్ కాల్ చేసినప్పుడు లేదా మొబైల్ నుంచి ల్యాండ్‌లైన్ కాల్, మొబైల్ న ఉంచి మొబైల్‌కు కాల్ చేసేటప్పునడు '0' యాడ్ చేయాల్సి అవసరం లేదు.
అలా కాకుండా ఎవరైనా జీరో లేకుండా ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ ఫోన్‌కు కాల్ చేస్తే ఒక ప్రకటన వినిపిస్తుంది. ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేస్తే ఇకపై మొబైల్ నెంబర్లకు 11 అంకెలు ఉండనున్నాయి. 10 డిజిట్ మొబైల్ నెంబర్ల నుంచి 11డిజిట్ నెంబర్ స్కీమ్ కింద మొబైల్ నెంబర్లు మొత్తం 10 బిలియన్ల నెంబర్ల కేపాసిటీని అందించనుంది. అలాగే డొంగల్ సంబంధిత మొబైల్ నెంబర్లకు కూడా 13 అంకెలుగా మారే అవకాశం ఉంది.