సచిన్ ఇంటి ముందు ఎమ్మెల్యే నిరసన
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు ఓ ఎమ్మెల్యే నిరసన చేపట్టారు.
By Srikanth Gundamalla Published on 1 Sept 2023 10:32 AM ISTసచిన్ ఇంటి ముందు ఎమ్మెల్యే నిరసన
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు ఓ ఎమ్మెల్యే నిరసన చేపట్టారు. ఆన్‌లైన్ గేమ్స్‌కు ప్రచారకర్తగా సచిన్ వ్యవహరించడం పట్ల ఆందోళన చేపట్టారు. తన మద్దతుదారులతో కలిసి సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన నిర్వహించిన ప్రహార్ జనశక్తి పక్ష ఎమ్మెల్యే బచ్చూ కాడూతో పాటు మరో 22 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కార గ్రహీతగా ఉన్న టెండూల్కర్.. ఆన్‌లైన్ గేమ్‌లకు మద్దతు ఇవ్వడం సరికాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. యువత జీవితాల నాశనం అవుతున్నాయని.. అలాంటి గేమ్స్‌కు సచిన్ మద్దతు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. అంతేకాదు.. సచిన్ టెండూల్కర్ భారత రత్నను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక సచిన్ టెండూల్కర్ ఆన్‌లైన్ గేమ్స్‌కు మద్దతు ఉపసంహరించుకోకపోతే ప్రతి గణేష్ మండపాల ఎదుట ధర్నాలు చేస్తామని పేర్కొన్నారు. ఇక నిరసన గురించి విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేతో పాటు 22 మందిపై కేసులు నమోదు చేశారు.
ఆన్‌లైన్ గేమ్‌లకు సచిన్ టెండూల్కర్ ప్రచారకర్తగా ఉండటంపై గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఆన్‌లైన్ గేమింగ్ వంటి అనైతిక కార్యకలాపాలను టెండూల్కర్ ప్రోత్సహించడాన్ని తప్పుబడుతూ.. ఆయన భారతర్న గౌరవాన్ని వెనక్కి తీసుకోవాలని లేఖలో కోరారు. గత వారంలో షారుక్‌ఖాన్ ఇంటి ముందు కూడా ఇలాంటి నిరసనలే కొనసాగాయి.