జాతీయ గీతం మ‌ర్చిపోయిన విద్యాశాఖ మంత్రి.. వీడియో వైర‌ల్‌

Minister who forgot the national anthem.. ఆయ‌నో విద్యాశాఖ మంత్రి. ఓపాఠ‌శాలలో జరిగిన కార్య‌క్ర‌మానికి హాజ‌రైయ్యారు.

By సుభాష్  Published on  19 Nov 2020 6:08 AM GMT
జాతీయ గీతం మ‌ర్చిపోయిన విద్యాశాఖ మంత్రి.. వీడియో వైర‌ల్‌

ఆయ‌నో విద్యాశాఖ మంత్రి. ఓపాఠ‌శాలలో జరిగిన కార్య‌క్ర‌మానికి హాజ‌రైయ్యారు. అక్క‌డ ఆ మంత్రి గారూ.. జాతీయ గీతం ఆల‌పించారు. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక స‌ద‌రు మంత్రిని నెటీజ‌న్లు బాగానే ట్రోల్ చేస్తున్నారు. అస‌లు ఆ వీడియో ఎందుకు వైర‌లైంది..? స‌ద‌రు మంత్రిని గారిని నెటీజ‌న్లు ఎందుకు అంత ట్రోల్ చేస్తున్నారాని అనుకుంటున్నారా..? ఎందుకంటే.. స‌ద‌రు మంత్రి గారు జాతీయ గీతాన్నే మ‌‌ర్చిపోయారు. జ‌న‌గ‌ణ‌మ‌ణ పాడుతూ.. మ‌ధ్య‌లో కొన్ని ప‌దాల‌ను మ‌ర్చిపోయారు. ఇంత‌కీ ఎవ‌రా మంత్రి గారు అంటారా..? ఆయ‌న మ‌రెవ‌రో కాదు బీహార్‌లో కొత్తగా కొలువుతీరిన నితీష్ కుమార్ క్యాబినేట్‌లోని విద్యాశాఖ మంత్రి డాక్టర్ మేవలాల్ ఛౌదరి.

బిహార్‌ విద్యాశాఖ మంత్రి మేవలాల్‌ చౌదరీ ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజర‌య్యారు. ఆ కార్య‌క్ర‌మంలో జాతీయగీతం పాడుతూ జనగణమన పాడుతూ.. మ‌ధ్య‌లో కొన్ని స‌రిగ్గా ప‌ల‌క‌లేక‌పోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను రాష్ట్ర జనతాదళ్ ట్విట్టర్‌లో పంచుకుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి జీతాయగీతం రాదు అంటూ ప్రతిపక్ష ఆర్‌జేడీ ట్వీట్ చేసింది. విద్యాశాఖ మంత్రంటే.. ఎంతో విద్యావంతుడై ఉంటాడు. ఉన్నత చదువులు చదివి ఉంటాడు అని అందరూ అనుకుంటారు. కానీ ఆ మంత్రికి జాతీయ గీతం కూడా పాడడం రాదు అంటూ జనగణమన పాడడం రాక ఇబ్బందులు పడిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక స‌ద‌రు విద్యాశాఖ మంత్రిగా ఎన్నికైన ఛౌదరిపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అవనీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేవాలాల్ ఛౌదరికి విద్యాశాఖ అప్పగించడంపై ట్విట్టర్లో విమర్శలు వస్తున్నాయి.

Next Story