మీథేన్ గ్యాస్ లీక్.. 51 మంది దుర్మరణం

బొగ్గు గనిలో గ్యాస్ లీక్ అవ్వడం వలన సంభవించిన పేలుడు కారణంగా 51 మంది మరణించారు.

By Srikanth Gundamalla  Published on  22 Sept 2024 4:00 PM IST
మీథేన్ గ్యాస్ లీక్.. 51 మంది దుర్మరణం

బొగ్గు గనిలో గ్యాస్ లీక్ అవ్వడం వలన సంభవించిన పేలుడు కారణంగా 51 మంది మరణించారు. 20 మంది గాయపడినట్లు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. ఇరాన్‌లోని దక్షిణ ఖొరాసన్ ప్రావిన్స్‌లో మదంజూ కంపెనీ నిర్వహిస్తున్న గనిలోని బీ, సీ అనే రెండు బ్లాకుల్లో మీథేన్ గ్యాస్ లీక్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

"దేశంలోని బొగ్గులో డెబ్బై ఆరు శాతం ఈ ప్రాంతం నుండి వస్తోంది. మదంజూ కంపెనీతో సహా దాదాపు 8 నుండి 10 పెద్ద కంపెనీలు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాయి" అని సౌత్ ఖొరాసన్ ప్రావిన్స్ గవర్నర్ అలీ అక్బర్ రహీమి తెలిపారు. B బ్లాక్‌లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. బ్లాక్‌లో ఉన్న 47 మంది కార్మికులలో 30 మంది మరణించారు. 17 మంది గాయపడ్డారని రహీమి తెలిపారు. C బ్లాక్‌లో సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు సమయంలో బ్లాక్‌లో 69 మంది కార్మికులు ఉన్నారని స్టేట్ టివి నివేదించింది. స్థానిక ఇరాన్ కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9 గంటలకు పేలుడు సంభవించింది.

Next Story