చిత్రకూట్ స్టూడియోలో అగ్నిప్రమాదం

Massive fire breaks out at Chitrakoot Studio in Mumbai’s Andheri. శుక్రవారం మధ్యాహ్నం అంధేరి (వెస్ట్) సబర్బన్‌లోని ఫిల్మ్ సెట్‌లో అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.

By M.S.R  Published on  29 July 2022 7:45 PM IST
చిత్రకూట్ స్టూడియోలో అగ్నిప్రమాదం

శుక్రవారం మధ్యాహ్నం అంధేరి (వెస్ట్) సబర్బన్‌లోని ఫిల్మ్ సెట్‌లో అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. అంధేరీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పక్కన చిత్రకూట్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఫిల్మ్ సెట్‌లో సాయంత్రం 4.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలోని ఒక దుకాణంలో మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు. ఇది ఫిల్మ్ సెట్‌లో జరిగిందని ధృవీకరించారు. ఘటనా స్థలం నుంచి నల్లటి పొగలు కమ్ముకున్నాయి.

మూడు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎవరికీ గాయాలు అయినట్లు ఎటువంటి నివేదికలు లేవని అధికారి తెలిపారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మూడు ఫైరింజన్లు, రెండు వాటర్ ట్యాంకర్లను రంగంలోకి దించారు. అంధేరీ వెస్ట్ ప్రాంతంలో సాయంత్రం 4:28 సమయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం డీఎన్ నగర్ ప్రాంతంలో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి.

Next Story