హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌ రాజీనామా, ఎందుకంటే..

లోక్‌భ ఎన్నికల ముందు హర్యానాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

By Srikanth Gundamalla  Published on  12 March 2024 7:22 AM GMT
manohar khattar, resign,  haryana cm,

 హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌ రాజీనామా, ఎందుకంటే..

లోక్‌భ ఎన్నికల ముందు హర్యానాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. హర్యానా రాష్ట్ర సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీ, జననాయక్‌ జనతా పార్టీ కూటమి విచ్చిన్నం కావడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. హర్యానాలోని లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకం విషయంలో ఈ కూటమిలో విభేదాలు తలెత్తాయి. దాంతో.. సీఎం పదవికి మనోహర్‌ లాల్‌ ఖట్టర్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు మనోహర్‌ లాల్ ఖట్టర్. మంత్రి మండలి సభ్యులు కూడా తమ రాజీనామా లేఖలను గవర్నర్‌కు సమర్పించారు.

తాజా పరిణామంతో హర్యానాలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 మంది సభ్యులు ఉన్నారు. హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకి 46 సీట్లు అవసరం. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాతా బీజేపీకి మెజార్టీ తక్కువ వచ్చింది. దాంతో.. బీజేపీ, జేజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

తాజా పరిణామంతో హర్యానాలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సరిపోయే బలం ఉంది. 46 సీట్లు అవసరం కాగా.. బీజేపీ ఎమ్మెల్యేలు 41 ఉన్నారు. మరో ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వెంటే ఉన్నారు. మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ రాజీనామాతో మంగళవారమే బీజేపీ తమ సీఎంను ఎన్నుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని సమాచారం. హర్యానా బీజేపీ తరఫున సీఎం రేసులో నయబ్‌ సైనీ ఉన్నారు.

Next Story