డిప్రెషన్‌లో పురుషాంగాన్ని కోసుకున్న వ్యక్తి.. దాన్ని అడవిలో పడేసి..

Man cuts off his penis in bangaon admitted to hospital. గత కొన్ని రోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతున్న ఓ వ్యక్తి తన పురుషాంగాన్ని కోసుకున్నాడు.

By అంజి  Published on  23 Nov 2022 4:23 PM IST
డిప్రెషన్‌లో పురుషాంగాన్ని కోసుకున్న వ్యక్తి.. దాన్ని అడవిలో పడేసి..

గత కొన్ని రోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతున్న ఓ వ్యక్తి తన పురుషాంగాన్ని కోసుకున్నాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో జరిగింది. అతడి పరిస్థితి విషమించడంతో బంగావ్‌ సబ్‌ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం అక్కడి నుంచి కోల్‌కతాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పురుషాంగం కోసుకున్న వ్యక్తిని శ్యామల్‌ ముండాగా గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున ఇంటి మరుగుదొడ్డిలో రక్తాన్ని చూసి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసింది. శ్యామల్‌ గత ఆరు నెలలుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం టాయిలెట్‌కి వెళ్లిన సమయంలో రక్తం కనిపించిందని శ్యామల్‌ సోదరుడు నిర్మల్‌ ముండా తెలిపాడు.

వెంటనే సోదరుడు నిర్మల్‌ తన తల్లిని పిలిచాడు. నేలపై రక్తం ఎందుకు ఉందని అడిగాడు. అయితే తల్లి తనకు తెలియదని చెప్పడంతో నిర్మల్‌.. శ్యామల్‌ దగ్గరికి వెళ్లి చూశాడు. అప్పటికే శ్యామల్‌ ఇంట్లో రక్తపు మడుగులో కనిపించాడు. తన పురుషాంగాన్ని కోసి అడవిలో పడేశానని సోదరుడికి చెప్పాడు. ఆ వెంటనే శ్యామల్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అతని శారీరక స్థితి చూసిన తర్వాత ప్రథమ చికిత్స చేసిన వైద్యుడు.. మెరుగైన చికిత్స కోల్‌కతాకు రిఫర్‌ చేశాడు. ఇంట్లో కూరగాయల కట్టర్‌కు రక్తం అంటుకోవడం చూశామని ఇంట్లో వాళ్లు చెప్పారు. ఆ కట్టర్‌తోనే శ్యామల్‌ తన పురుషాంగాన్ని కోసుకుని ఉండొచ్చని ఇంట్లో వాళ్లు అంటున్నారు.

Next Story