చంద్రుడిపై ఎకరా స్థలాన్ని భార్యకు గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. చంద్రుడిపై స్థలాన్ని కొనుగోలు చేసి కానుకగా ఇచ్చాడు.
By Srikanth Gundamalla Published on 7 Sept 2023 5:12 PM ISTచంద్రుడిపై ఎకరా స్థలాన్ని భార్యకు గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు ఓ వ్యక్తి అరుదైన గిఫ్ట్ ఇచ్చాడు. చంద్రుడిపై ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి ఆమెకు కానుకగా ఇచ్చాడు. లూనా సొసైటీ ఇంటర్నేషనల్ అనే సంస్థ చంద్రుడిపై స్థలం అమ్మకాలు సాగిస్తోంది. ఈ క్రమంలోనే పశ్చిమబెంగాల్‌కు చెందిన వ్యక్తి ఎకరం స్థలాన్ని కొని భార్యకు కానుకగా అందజేశాడు.
పశ్చిమ బెంగాల్ లోని ఝర్ గ్రామ్ జిల్లాకు చెందిన సంజయ్ మహతో, అనుమిక దంపతులు. పెళ్లికి ముందు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే.. ప్రేమలో ఉన్న సమయంలో చందమామను తెచ్చి ఇస్తానని అనుమికతో చెప్పాడు సంజయ్. అయితే.. ఆ మాటను తాజాగా అమలు చేశాడు. పెళ్లిన భార్య మొదటి పుట్టిన రోజు వచ్చింది. ఆ రోజు తనకు ఎప్పటికీ గుర్తిండి పోవాలని.. చంద్రుడిపై ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చాడు. రూ.10వేలకు ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పాడు సంజయ్. స్థలానికి సంబంధించిన పత్రం అందజేసినప్పుడు తన భార్య కళ్లలో ఆనందం తనకు ఎంతో నచ్చిందని చెప్పుకొచ్చాడు.
అనుమికతో చాలా కాలంగా ప్రేమలో ఉన్నానని చెప్పాడు సంజయ్. గత ఏప్రిల్‌లోనే వీరి వివాహం జరిగింది. తన స్నేహితుడి సహాయంతో సంజయ్ లూనా సొసైటీ ఇంటర్నేషనల్‌ను సంప్రదించాడు. ఆ తర్వాత చంద్రుడిపై ఎకరా స్థలాన్ని కొనుగోలు చేశాడు. మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు ఏడాది పట్టిందని సంజయ్ తెలియజేశాడు. సంజయ్ ఒక్కడే కాదు.. గతంలో ఇలా కొందరు భూమిపై స్థలాన్ని కొన్న సంఘటనలూ చూశాం. చంద్రుడిపై స్థలాలను కొన్ని కంపెనీలు విక్రయిస్తున్నాయి. మరి అవి చెల్లుతాయా లేదా అన్నది తెలియదు.